CM Revanth Reddy Fired on PM Modi : మోదీ..ద‌మ్ముంటే బీసీల‌కు న్యాయం చేయాలి

నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి

Hello Telugu - CM Revanth Reddy Fired on PM Modi

Hello Telugu - CM Revanth Reddy Fired on PM Modi

CM Revanth Reddy : ఢిల్లీ – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఢిల్లీ రాజ‌ధాని జంత‌ర్ మంత‌ర్ వద్ద ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు సీత‌క్క‌, కొండా సురేఖ‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేష‌న్ చైర్మ‌న్లతో పాటు ఇండియా కూట‌మికి చెందిన ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఏకి పారేశారు. ఆయ‌న బీసీ కాద‌న్నారు. బీసీల పేరు చెప్పుకుని ఇంత కాలం ఓట్ల‌ను పొందార‌ని ఆరోపించారు. తాను బీసీ అయితే ద‌మ్ముంటే బీసీల కోసం ప‌ని చేయాల‌ని తాము తీసుకు వ‌చ్చిన 42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదించాల‌ని డిమాండ్ చేశారు.

CM Revanth Reddy Slams PM Modi

ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాల్ విసురుతున్నాన‌ని అన్నారు. మా డిమాండ్ ను ఆమోదిస్తారా.. లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగరేయాలా అని నిల‌దీశారు. త‌మ‌ నాయకుడు రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేసి.. 42 శాతం ఓబీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామ‌ని అన్నారు. మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేం అడగలేదు… మీ పోరుబందర్ పోర్టు నుంచి చుక్క నీరు అడగ లేదన్నారు రేవంత్ రెడ్డి. మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డపై మా బలహీన వర్గాల సోదరులకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చుకుంటామని అడిగితే మీ గుజరాత్ కు వచ్చిన కడుపు మంట ఏంటి అంటూ ప్ర‌శ్నించారు.

Also Read : Manda Krishna Madiga Fired on KCR : ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కేసీఆర్ ఉన్నా లేన‌ట్టే

Exit mobile version