Manda Krishna Madiga Fired on KCR : ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కేసీఆర్ ఉన్నా లేన‌ట్టే

ఎంఆర్పీఎస్ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ

Hello Telugu - Manda Krishna Madiga Fired on KCR

Hello Telugu - Manda Krishna Madiga Fired on KCR

Manda Krishna Madiga : హైద‌రాబాద్ – ఎంఆర్పీఎస్ జాతీయ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ప్ర‌తి ప‌క్ష నాయ‌కుడిగా ఉన్న కేసీఆర్ పూర్తిగా విఫ‌లం అయ్యార‌ని ధ్వ‌జ‌మెత్తారు. పెన్షన్ పెంపు హామీపై ప్రతిపక్షాలు మాట్లాడక పోవడం దారుణం అన్నారు. పక్క రాష్ట్రంలో హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ ఇస్తుంటే.. తెలంగాణలో అధికారంలోకి వచ్చి 20 నెలలుగా గడిచిన హామీ అమలు కాలేదన్నారు. గురువారం మంద‌కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బ‌డుగు, బ‌ల‌హీన‌, మైనార్టీ, నిమ్న వ‌ర్గాల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాల‌ని డిమాండ్ చేశారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

Manda Krishna Madiga Slams KCR

రాష్ట్రంలో రోజు రోజుకు స‌మ‌స్య‌లు పేరుకు పోతున్నాయ‌ని, అయినా పాల‌కులు సోయి లేకుండా ఉండ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారంలోకి వ‌చ్చిన ఏడాది లోపే 2 ల‌క్ష‌ల జాబ్స్ భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పార‌ని కానీ ఇప్ప‌టి దాకా ఎన్ని భ‌ర్తీ చేశారో శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని మంద‌కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు మంద‌కృష్ణ మాదిగ‌. ప్ర‌జ‌ల‌ను త‌క్కువ అంచ‌నా వేయొద్ద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఏ పాల‌కులైనా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాల‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఉచిత బ‌స్సు ప్ర‌యాణం త‌ప్పా ఏదీ స‌క్ర‌మంగా అమ‌లు చేసిన పాపాన పోలేద‌న్నారు. తాజాగా మంద‌కృష్ణ మాదిగ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Also Read : Hydraa Shocking : వాస‌వీ నిర్మాణ సంస్థ‌ పై హైడ్రా చ‌ర్య‌లు

Exit mobile version