CM Revanth Reddy Strong Focus on Jubilee Hills : జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల కోసం మంత్రుల‌కు బాధ్య‌త‌లు

అప్పగించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

Hello Telugu - CM Revanth Reddy Strong Focus on Jubilee Hills

Hello Telugu - CM Revanth Reddy Strong Focus on Jubilee Hills

CM Revanth Reddy : హైద‌రాబాద్ : వ‌చ్చే నెల న‌వంబ‌ర్ 11న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఇందులో భాగంగా పార్టీ ఇప్ప‌టికే స్టార్ క్యాంపెయిన‌ర్ల‌ను ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది టీపీసీసీ నుంచి. ఈ ఉప ఎన్నిక కోసం డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్ప‌గించింది. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని యూసఫ్ గూడ డివిజన్ కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ ను నియ‌మించింది. ఇక రహమత్ నగర్ డివిజన్ కు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని , వెంగల్ రావు నగర్ డివిజన్ కు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిని నియ‌మించింది.

CM Revanth Reddy Focus

సోమాజిగూడ డివిజన్ కు మంత్రులు శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ల‌ను, బోరబండ డివిజన్ కు మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవిల‌ను, షేక్ పేట్ డివిజన్ కు మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామిల‌ను,
ఎర్రగడ్డ డివిజన్ కు మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఇదిలా ఉండ‌గా ఇక్క‌డ పోటీ హోరా హోరీగా కొన‌సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రౌడీ షీట‌ర్ గా పేరు పొందిన చిన్న శ్రీ‌శైలం యాద‌వ్ త‌న‌యుడు న‌వీన్ యాద‌వ్ కు బ‌రిలోకి దింపింది. ఇక బీఆర్ఎస్ త‌ర‌పున దివంగ‌త ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత‌ను పోటీలో ఉంచింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి లంకాల దిలీప్ రెడ్డిని ఖ‌రారు చేసింది.

Also Read : Minister Savitha Clear Instructions : బీసీ హాస్టల్ విద్యార్థులను కాపాడు కోవాలి

Exit mobile version