Minister Savitha Clear Instructions : బీసీ హాస్టల్ విద్యార్థులను కాపాడు కోవాలి

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సవిత పిలుపు

Hello Telugu - Minister Savitha Clear Instructions

Hello Telugu - Minister Savitha Clear Instructions

Minister Savitha : తాడేపల్లి/అమరావతి : మొంథా తుఫాన్ నుంచి బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లో చదువుకునే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడు కోవాల‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha). తుఫాన్ తీవ్రంగా ఉండే ప్రాంతాల్లోని విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, ఎంజేపీ స్కూల్ కార్యదర్శి మాధవీలతతో మంత్రి సవిత మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో బీసీ హాస్టళ్ల విద్యార్థుల రక్షణకు తీసుకున్న చర్యల గురించి జిల్లాల వారీగా మంత్రి సవిత అడిగి తెలుసుకున్నారు. పలువురు డీబీసీడబ్ల్యూవోల తోనూ మంత్రి స్వయంగా ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు.

Minister Savitha Key Instructions

అనంతరం మంత్రి సవిత సవిత మాట్లాడుతూ, వార్డెన్లు, ఏబీసీడబ్ల్యూవోలు, ప్రిన్సిపాళ్లు 24 గంటలూ హాస్టళ్లలో ఉండడడంతో పాటు రాత్రి సమయంలో విద్యార్థులతో కలిసి నిద్రపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్ల విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు, తాజా ఆహారం మాత్రమే అందివ్వాలని స్ప‌ష్టం చేశారు మంత్రి ఎస్. స‌విత‌. బయట ఆహారాలను హాస్టళ్లలోకి అనుమతించ వ‌ద్ద‌ని సూచించాచ‌రు. తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ కోతలు ఉండే అవకాశముందని, ఇన్వర్టర్లను పొదుపుగా వాడుకోవాలని తెలిపారు. టార్చిలైట్లు, క్యాండిల్స్, అగ్గి పెట్టెలను పెద్ద మొత్తంలో ముందు జాగ్రత్తగా సమకూర్చు కోవాల‌ని సూచించారు.

Also Read : CM Chandrababu Important Meeting : జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై స‌మీక్ష

Exit mobile version