మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను క‌లిసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానం

hellotelugu-CMRevanthReddy

ఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు కాంగ్రెస్ ఎంపీలు . ఈ సంద‌ర్బంగా మ‌ర్యాద పూర్వ‌కంగా ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే నివాసంలో క‌లిశారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబ‌ర్ 8,9వ తేదీల‌లో తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ స‌మ్మిట్ 2025 పేరుతో స‌దస్సు నిర్వ‌హిస్తోంద‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన సంస్థ‌లు, క‌న్స‌ల్టెంట్స్, చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, ప్ర‌తినిధులు , టెక్ దిగ్గ‌జాలు, వ్యాపార‌వేత్త‌లు, ఔత్సాహికులు, ఆంట్ర‌ప్రెన్యూర్స్ పెద్ద ఎత్తున హాజ‌ర‌వుతున్నార‌ని తెలిపారు.

రాష్ట్రం తన అభివృద్ధి దార్శనికత, ప్రధాన మౌలిక సదుపాయాల కార్యక్రమాలు, పెట్టుబడి అవకాశాలు , దీర్ఘకాలిక “తెలంగాణ రైజింగ్ 2047” రోడ్‌మ్యాప్‌ను ప్రదర్శించడానికి ప్రధాన వేదికగా ఉపయోగ పడుతుందని ఈ సంద్బంగా తెలిపారు. ఈ స‌ద‌స్సుకు రావాల‌ని ఖ‌ర్గేను అధికారికంగా ఆహ్వానించారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం త‌ర‌పున దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ఉప రాష్ట్ర‌ప‌తి కేపీ రాధాకృష్ణ‌న్, రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముతో పాటు కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులకు సైతం ఆహ్వానాలు అందించే ఏర్పాట్లు చేశామ‌న్నారు సీఎం అనుముల రేవంత్ రెడ్డి.

Exit mobile version