CM Revanth Reddy Strong Challenge : కొడంగల్ తెలంగాణ నోయిడా అవుతుంది

ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

Hello Telugu - CM Revanth Reddy Strong Challenge

Hello Telugu - CM Revanth Reddy Strong Challenge

CM Revanth Reddy : వికారాబాద్ జిల్లా : తెలంగాణ ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వికారాబాద్ జిల్లా కోడంగ‌ల్ లో ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌మావేశంలో సీఎం ప్ర‌సంగించారు. రాబోయే రోజుల్లో కోడంగ‌ల్ తెలంగాణ నోయిడాగా మారుతోంద‌ని చెప్పారు. కొడంగల్ త్వరలో రైళ్ల శబ్దం వింటుందని అన్నారు. 70 ఏళ్ల కల వాస్తవ రూపం దాల్చింద‌ని చెప్పారు. రైల్వే లైన్ పనులు తొమ్మిది నెలల్లో ప్రారంభమవుతాయని ప్ర‌క‌టించారు రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy Strong Challenge for Kodangal

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రైతులు ఇష్ట పూర్వకంగా భూమి ఇస్తున్నారని చెప్పారు. ఇది మూడు సంవత్సరాలలో పూర్తవుతుందని వెల్ల‌డించారు. కొడంగల్ భూములకు కృష్ణా నది నీరు అందు తుందన్నారు రేవంత్ రెడ్డి. ల‌గ‌చ‌ర్ల‌ పారిశ్రామిక ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాల పారిశ్రామిక జోన్‌గా అప్‌గ్రేడ్ చేస్తామ‌న్నారు. కొడంగల్‌లో సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. కొడంగల్‌లో వైద్య, పశువైద్య, వ్యవసాయ, పారా మెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలు, ఏటీసీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్ లు ఉన్నాయ‌న్నారు ఎ. రేవంత్ రెడ్డి . 16 నెలల్లో కొడంగల్‌ను అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా మార్చడమే లక్ష్యమ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Kavitha Fired on Congress : విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోని స‌ర్కార్

Exit mobile version