CM Revanth Reddy : హైదరాబాద్ : హైదరాబాద్‌లో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్‌ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సంస్థ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా హైదరాబాద్ జీఎంఆర్ ఎయిరోపార్క్ (ఎస్ఈజెడ్) లో నెలకొల్పిన ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. హైదరాబాద్ దేశంలోనే ప్రధాన ఎయిరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా మారిందని చెప్పారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బెంగుళూరు – హైదరాబాద్‌ను డిఫెన్స్, ఎయిరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎయిరోస్పేస్ రంగంలో ముఖ్యంగా వాటి నిర్వహణ, మరమ్మత్తులు, ఓవర్‌హాల్ వంటి సదుపాయాలతో పాటు పరికరాల తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో సాఫ్రన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy Key Comments on Hyderabad
తెలంగాణపై ఎంతో నమ్మకంతో సెఫ్రాన్ గ్రూపు తన ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నందుకు ఆ సంస్థను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సెంటర్ ఏర్పాటు ఎయిరోస్పెస్, రక్షణ రంగంలో తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసులను అందించడంలో దేశంలోనే ఇది మొట్టమొదటి సెంటర్ అని అన్నారు. ఈ ఫెసిలిటీ సెంటర్‌తో పాటు సాఫ్రన్‌కు చెందిన ఎం88 మిలటరీ ఇంజిన్ల నిర్వహణ, మరమత్తులు, ఓవర్ హాల్ (ఎంర్ఓ) కు శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమైన పరిణామం అని పేర్కొన్నారు. భారత వైమానిక దళం, నావికాదళానికి ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.
Also Read : Minister Atchannaidu Fired on YS Jagan : రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు
