CM Revanth Reddy : ఢిల్లీ – ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను డైనమిక్ లీడర్ నని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పోరాటం నా చివరి అస్త్రం అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ సాధించలేనిది నేను సాధించానని చెప్పారు. 2018లో కేసీఆర్ రిజర్వేషన్లను 23 శాతానికి కుదించారని ఆరోపించారు. 50 శాతం మించేది లేదంటూ బీసీ రిజర్వేషన్ పైన చట్టం చేశారని మండిపడ్డారు. కానీ మేం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని అన్నారు సీఎం.
CM Revanth Reddy Comments
తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను తీసివేసిన తర్వాత తెలంగాణలో తీసేయమని అడగాలన్నారు. కేటీఆర్ ది గంజాయి బ్యాచ్ అని ఆరోపించారు. కేటీఆర్ చుట్టూ ఉండే వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని అన్నారు. తన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. డ్రగ్స్ టెస్టుకు రమ్మంటే పారిపోయింది ఎవరు అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
కేటీఆర్ పార్టనర్, ఫ్రెండ్ కేదార్ మిక్స్‌డ్ డ్రగ్స్ తీసుకుని దుబాయ్ లో చనిపోయాడని ఆ విషయం బహిరంగ రహస్యమేనని అన్నారు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు కూడా నేను తెప్పించానని చెప్పారు. కేసీఆర్ చర్చకు వస్తే నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. బాత్రూంలు కడిగే వాళ్లతో చర్చకు నేను పోనని అన్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లి కవితే ఒప్పుకోవడం లేదన్నారు. కవితకు ఆమె ఇంట్లోనే విలువ లేదన్నారు. కేటీఆర్ కు ప్రతిపక్ష హోదాను కేసీఆర్ ఇవ్వడం లేదని అందుకే ఆ నిరాశతో తనపై అడ్డగోలుగా కామెంట్స్ చేస్తున్నాడని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో, స్లీపింగ్ ప్రెసిడెంటో నాకేం తెలుసు అని ప్రశ్నించారు.
Also Read : CM Chandrababu Shocking Comments : బెదిరిస్తానంటే నేను ఊరుకుంటానా – సీఎం
