CM Chandrababu : అమరావతి – తాను బెదిరిస్తే పారిపోయే వ్యక్తిని కానంటూ సంచలన ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశంలో నీటి సమస్యలపై కీలక చర్చలు జరిగాయని అన్నారు.నీళ్ల విషయంలో ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవలంబిస్తామని చెప్పారు. ప్రధాని కూడా నదుల అనుసంధానం చేయాలని భావిస్తున్నారని తెలిపారు. బనకచర్లపై ముందుకే వెళతామన్నారు. ఆరు నూరైనా సరే 200 టీఎంసీల నీళ్లు వాడుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు అర్థం అవుతోందన్నారు.
CM Chandrababu Slams
బనకచర్ల ప్రాజెక్టు వల్ల రాయలసీమకు నీళ్లు అందుతాయని, వారి దాహార్తి తీరుతుందన్నారు. తనకు ఇటు ఏపీ అటు తెలంగాణ రెండు కళ్లు లాంటివన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రాంతం పూర్తిగా అభివృద్ది చెందిందని చెప్పారు. ఇవాళ ఐటీ అభివృద్ది చెందడానికి, పెట్టుబడులు రావడానికి తానే కారణమన్నారు. ఆనాడు టెక్నాలజీ గురించి మాట్లాడితే ఎద్దేవా చేశారని ఇవాళ లక్షలాది మంది దీనిపై ఆధారపడి బతుకుతున్నారని చెప్పారు చంద్రబాబు నాయుడు (CM Chandrababu). తాము తెలంగాణ ప్రాంతానికి మేలు చేకూర్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ప్రతి ఏటా గోదావరి, కృష్ణా నదుల నుంచి పెద్ద ఎత్తున నీళ్లు దిగువకు వృధాగా పోతున్నాయని, అందుకే తాము 200 టీఎంసీలను తీసుకు వెళుతున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. బెదిరింపులకు భయపడే వ్యక్తిని తాను కానని, ముందుకే వెళ్లడం తన అభిమతమని స్పష్టం చేశారు.
Also Read : IOCL New Innovation – TTD : ఐఓసీఎల్ గ్యాస్ స్టోరేజ్ కేంద్రానికి భూమిపూజ
