CM Revanth : న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth). ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా కొలువు తీరాక దేశ రాజధానికి బాట పట్టడం ఇది 55వసారి కావడం విశేషం. ఇప్పటి వరకు ఏ కాంగ్రెస్ సీఎం ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లలేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సవాల్ గా మారింది. ఆయనతో పాటు మంత్రులు, పార్టీ హైకమాండ్ కు కూడా అగ్ని పరీక్ష లాగా మారింది. వచ్చే నవంబర్ నెల 11న పోలింగ్ జరగనుంది. 14న తుది ఫలితం ప్రకటించనుంది. ఇప్పటి వరకు బై పోల్ కు సంబంధించి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కాగా, నిన్నటితో నామినేషన్ల గడువు, తుది పరిశీలన ముగిసింది. ఇక ఉప ఎన్నికల్లో మొత్తం 81 మంది నామినేషన్లను ఖరారు చేశారు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ , హెచ్ఎండీఏ కమిషనర్ కర్ఱన్.
CM Revanth Reddy – KC Venugopal Meeting
ఈ ఉప ఎన్నికలో పలువురు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి భార్య మాగంటి సునీత, భారతీయ జనతా పార్టీ నుంచి లంకాల దిలీప్ రెడ్డి పోటీలో ఉన్నారు. కానీ ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే ఉండనుంది ఈ పోరాటం. ఇక ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి గుండె పోటుతో మృతి చెందారు. దీంతో పోటీ అనివార్యంగా మారింది. ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఆయా పార్టీలు గెలుపే ప్రధాన లక్ష్యంగా ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు బై పోల్ పై కూడా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఉన్నారు.
Also Read : K Kavitha Interesting Comments : నిజామాబాద్ జిల్లా ప్రజలకు రుణపడి ఉంటా : కవిత
