K Kavitha Interesting Comments : నిజామాబాద్ జిల్లా ప్ర‌జ‌ల‌కు రుణ‌ప‌డి ఉంటా : క‌విత‌

రాజ‌కీయ జీవితానికి ఇక్క‌డే శ్రీ‌కారం చుట్టా

Hello Telugu - K Kavitha Interesting Comments

Hello Telugu - K Kavitha Interesting Comments

K Kavitha : నిజామాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, శాస‌న మండ‌లి స‌భ్యురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌న‌కు రాజ‌కీయంగా ఛాన్స్ ఇచ్చిన నిజామాబాద్ జిల్లాను తాను మ‌రిచి పోలేన‌ని, జీవితాంతం గుర్తు పెట్టుకుంటాన‌ని అన్నారు. తాను చేప‌ట్టిన జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మానికి ఈ జిల్లా నుంచే శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్బంగా తాను ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా నాకు పట్టం కట్టి నా రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టిన జిల్లా. ప్రజల కష్ట సుఖాలు తెలుసు కోవడానికి ఇక్క‌డికి వ‌చ్చాన‌ని అన్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ (K Kavitha). అందుకే తాను చేప‌ట్టిన ఈ మ‌హ‌త్ కార్య‌క్ర‌మాన్ని నిజామాబాద్ జిల్లా నుంచే ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు.

K Kavitha Comments

ఈ సంద‌ర్బంగా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా తాను చేప‌ట్టిన ఈ ప్ర‌జా కార్య‌క్ర‌మానికి అశేషంగా త‌ర‌లి రావ‌డం, మ‌ద్ద‌తు తెల‌ప‌డం మ‌రింత ఆనందాన్ని ఇచ్చేలా చేసింద‌న్నారు. అంతే కాదు ఇక్క‌డికి వ‌చ్చి త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు ఇచ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నారు. అందుకే తాను ఇక్క‌డి నుంచే జ‌నం బాట‌ను ప్రారంభించాల‌ని స‌ముచితంగా భావించిన‌ట్లు చెప్పారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఇదిలా ఉండ‌గా ఉత్సాహంతో నన్ను స్వాగతించి అక్కున చేర్చుకున్న నిజామాబాద్ జిల్లా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు ఘన స్వాగతం పలికిన యువతకు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

Also Read : Minister Kandula Durgesh Interesting Comments : రైతుల సంక్షేమం కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యం

Exit mobile version