CM MK Stalin : తమిళనాడు : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM MK Stalin) కీలక ప్రకటన చేశారు. తన యూరప్ పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సోమవారం సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా రూ. రూ.15,516 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడం జరిగిందని స్పష్టం చేశారు. తమిళనాడులో పెట్టుబడులు పెట్టడానికి 10 కొత్త పరిశ్రమలు ముందుకు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 17 పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా తమ ఉనికిని విస్తరించాలని నిర్ణయించాయన్నారు.
CM MK Stalin Gets Huge Investments
యుకె లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వ విద్యాలయంలోని సెయింట్ ఆంటోనీ కళాశాలలో పెరియార్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు ఎంకే స్టాలిన్. అంతకు ముందు సీఎం ఇంగ్లండ్ తో పాటు జర్మనీలలో వారం రోజుల పాటు పర్యటించారు. ఇవాళ చెన్నైకి సురక్షితంగా చేరుకున్నారు. రూ. 15 వేల కోట్లకు పైగా 33 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు స్టాలిన్. ఈ పర్యటన విజయవంతమైందని పేర్కొన్నారు. అద్భుతమైన స్పందన లభించిందన్నారు. చాలా కంపెనీలు, ఔత్సాహిక పర్యాటకులు పెద్ద ఎత్తున స్పందించడం తనకు ఆనందం కలిగించిందని పేర్కొన్నారు సీఎం.
జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌లోని ప్రఖ్యాత క్లాసిక్ రెమిస్‌ను కూడా సందర్శించడం జరిగిందన్నారు. జర్మనీ , ఇంగ్లాండ్‌లకు ఈ పర్యటన గత 4 సంవత్సరాల పర్యటన కంటే మరింత విజయవంతంగా ముగియడం మరింత సంతోషం కలిగించేలా చేసిందన్నారు. తాను సీఎంగా వెళ్ల లేదని ద్రవిడ జాతి ఔన్నత్యాన్ని దేశానికి చాటి చెప్పిన పెరియార్ కె. రామస్వామి మనవడిగా అక్కడికి వెళ్లానన్నారు.
Also Read : India Won Hockey Interesting : ఆసియా కప్ హాకీ ఛాంపియన్ ఇండియా
