India Won Hockey Interesting : ఆసియా క‌ప్ హాకీ ఛాంపియ‌న్ ఇండియా

ద‌క్షిణ కొరియాకు కోలుకోలేని బిగ్ షా

Hello Telugu - India Won Hockey Interesting

Hello Telugu - India Won Hockey Interesting

India : భార‌త హాకీ జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఆసియా క‌ప్ ను చేజిక్కించుకుంది ఛాంపియ‌న్ గా నిలిచింది. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. ఇప్ప‌టికే బ‌ల‌మైన చైనాను 7-0 భారీ తేడాతో ఓడించి ఫైన‌ల్ కు చేరుకుంది భార‌త్. ఫైన‌ల్ లో ద‌క్షిణ కొరియాకు షాక్ ఇచ్చింది. ఫైన‌ల్ మ్యాచ్ హోరా హోరీగా జ‌రిగింది. నువ్వా నేనా అన్న రీతిలో జ‌రిగినా చివ‌ర‌కు భార‌త జ‌ట్టునే ఆధిప‌త్యం చెలాయిస్తూ వ‌చ్చింది. దీంతో 4-1 గోల్స్ తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. విజేతగా నిలిచింది. కోట్లాది భార‌తీయుల‌కు తీపి క‌బురు చెప్పింది.

India Won Hockey with South Korea

బీహార్‌లోని రాజ్‌గిర్‌లో భారతదేశం, కొరియా మధ్య జరిగిన పురుషుల హాకీ ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో గోల్ చేసిన జ‌ట్టు గెలుపు ఖాయ‌మై పోయింది. ఆసియా కప్ ట్రోఫీని ఎగరవేసి వచ్చే ఏడాది ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. ఈ కీల‌క‌మైన ఫైన‌ల్ మ్యాచ్ లో అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించాడు దిల్ ప్రీత్ సింగ్ (Dilpreet Singh). మ్యాచ్ సంద‌ర్బంగా 28వ నిమిషంలో, 45వ నిమిషంలో రెండు గోల్స్ సాధించాడు. సుఖ్ జీత్ సింగ్ 1వ నిమిషంలో గోల్ చేసి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు ఝ‌ల‌క్ ఇచ్చాడు. ఇదే స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి అమిత్ రోహిదాస్ 50వ నిమిషంలో కీల‌క గోల్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు.

ఇదిలా ఉండ‌గా ఆట ముగిస్తుంద‌న‌గా 51వ నిమిషంలో ప్ర‌త్య‌ర్థి ద‌క్షిణ కొరియా జ‌ట్టుకు చెందిన 51వ నిమిషంలో డైన్ స‌న్ అద్భుత‌మైన గోల్ చేశాడు. అయినా ఆఖ‌రులో ఫ‌లితం లేకుండా పోయింది. ఇదిలా ఉండ‌గా భారతదేశం ఈ టోర్నమెంట్‌ను అజేయ రికార్డుతో ముగించింది. ఐదు విజ‌యాలు సాధించింది. చివ‌ర‌కు ఛాంపియ‌న్ న‌ని నిరూపించుకుంది.

Also Read : CM Chandrababu Interesting Comments : సంక్షేమం కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యం : సీఎం

Exit mobile version