CM Chandrababu : పల్నాడు జిల్లా : రాష్ట్రం నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు, కాలుష్య రహితంగా మార్చేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ ఉద్యమం చేపట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్పష్టం చేశారు. ఈ ఉద్యమం ద్వారా 2026 జూన్ నాటికి రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని ఆయన వెల్లడించారు. పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక చెరువు వద్ద పేరుకు పోయిన చెత్త తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
చెరువు గట్టు, పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా ఉన్న చెత్తను, గట్టు వద్ద పేరుకు పోయిన వ్యర్ధాలను మున్సిపల్ కార్మికులతో కలిసి సీఎం తొలగించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సీఎం సందర్శించారు. సఫాయి కార్మికులు, వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి సంభాషించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.52 కోట్ల విలువైన చెక్కును అందించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
CM Chandrababu Key Comments
రాజకీయ ముసుగులో రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోమని చంద్రబాబు (CM Chandrababu) హెచ్చరించారు. ప్రజలు అధికారం ఇచ్చింది మంచి పాలన అందించడానికే కానీ ప్రజలపై దాడులు చేయడానికి కాదని అన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. చెత్తనే కాదు చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తామని స్పష్టం చేశారు. మాచర్ల ప్రజల ముఖాల్లో ఆనందాన్ని చూస్తున్నాను. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాలాంటి వారే గత ప్రభుత్వంలో మాచర్లకు రాలేక పోయామంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.
ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని మిమ్మల్ని చూస్తుంటే అర్ధం అవుతోందన్నారు. రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు మాచర్లలో రౌడీలు, ముఠా నేతలు స్థానిక ప్రజల ఆస్తులను ధ్వంసం చేశారు. ఎన్నో ఏళ్లుగా మాచర్లలో ప్రజాస్వామ్యం లేదు. ఎన్నికలు లేవు. గత ప్రభుత్వంలో నేను మాచర్ల రాకుండా నా ఇంటికి తాళ్లు కట్టారని అన్నారు. ఆ తాళ్లతో వాళ్లు ఉరితాళ్లు వేసుకున్నారు. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతలపై దాడి చేశారు. సీమలో ముఠా రాజకీయాలు లేకుండా చేశాను. పల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. ప్రజా ప్రతినిధులు, ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడాలి విద్రోహ శక్తులుగా మారకూడదు అని చంద్రబబు హెచ్చరించారు.
Also Read : Madhu Yashki Goud Shocking Comments : కేసీఆర్ నాటకంలో భాగమే కవితపై వేటు
