Madhu Yashki Goud : హైదరాబాద్ : కవితపై బీఆర్ఎస్ పార్టీ వేటు వేయడంపై సంచలన కామెంట్స్ చేశారు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ (Madhu Yashki Goud). హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమిత్ షా కూడా కెసిఆర్ కు కాళేశ్వరం ఏటీఎం అన్నాడని, దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. రెండు రోజుల్లో తేలుస్తామని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పారని మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం విచారణకు సీబీఐకి ఆదేశించినా ఎందుకు సప్పుడు చేయడం లేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ లోకల్ గా విచారణ చేస్తే రాజకీయ కక్ష అన్నారని, గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కూతురు పెళ్లి జరగకుండా సీబీఐ అడ్డుకుందన్నారని పేర్కొన్నారు.
Madhu Yashki Goud Shocking Comments Kavitha Issue
కవిత ఇంటి నుండి బయటకు రావడం అనేది కేసీఆర్ రచించిన నాటకమేనని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో జిరో సీట్లు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కూడా పెట్టని తీరు తో అస్తిత్వం కాపాడు కోవడానికి, ఏ విధంగా అధికారంలోకి రావాలి అని కేసీఆర్, బీఆర్ఎస్ చూస్తోందన్నారు మధు యాష్కి గౌడ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒడి పోతామని బీఆర్ఎస్ కు భయం పట్టుకుందన్నారు. కవిత ఆరు నెలల కింద అన్నపైన అలిగిందని, ఇప్పుడు బావ పైన మాట్లాడుతోందన్నారు. సారా కుంభకోణంలో ఇరికిన వాళ్ళు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విమలక్క లాంటి వాళ్ళు పార్టీ పెడితే ఆదరిస్తారని , తను పార్టీ పెడితే ఎవరూ ఆదరించరని ఎద్దేవా చేశారు మాజీ ఎంపీ.
Also Read : Ex DSP Nalini Shocking Letter : మాజీ డీఎస్పీ నళిని బహిరంగ లేఖ
