Sabitha Indra Reddy : హైదరాబాద్ : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ డీజీపీని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఖాకీ బుక్ మాత్రమే నడుస్తుంది అని చెప్పిన శివధర్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇదేనా మీ ఖాకీ బుక్ పద్ధతి అని నిలదీశారు. డీజీపీ శివధర్ రెడ్డిని ఉద్దేశించి సబితా ఇంద్రారెడ్డి సూటిగా నిలదీశారు. రేవంత్ రెడ్డి సహచరుడు రోహిన్ రెడ్డి గన్ పట్టుకుని ప్రజలను బెదిరిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. అతనిపైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రమంతా గన్ కల్చర్ విస్తరించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సబితా ఇంద్రారెడ్డి. తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను కావాలని కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆరోపించారు. ఇదేనా ప్రజా పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ex Minister Sabitha Indra Reddy Slams
కార్యకర్తలు ఒక రీట్వీట్ చేస్తేనే రాత్రికి రాత్రి అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి మంత్రి ఇంట్లో నిందితుడు ఉంటే చర్యలు తీసుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్న వాళ్లకి ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం ఉండటమేనా మీరు చెప్పిన ఖాకీ బుక్ అని నిలదీశారు. మరో వైపు రోజు రోజుకు రేవంత్ రెడ్డి సీఎంగా కొలువు తీరాక ఆక్రమణలు, అక్రమాలకు రాష్ట్రం కేరాఫ్ గా మార్చేశారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని అన్నారు.
Also Read : Nara Lokesh Important Tour : ఆస్ట్రేలియా ఇండియా ఫోరం డైరెక్టర్ తో లోకేష్ భేటీ
