CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఎవరైనా సరే వేధింపులకు గురి చేసినా లేదా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ ను ఎవరైనా సరే చేతుల్లోకి తీసుకుంటామంటే తాట తీస్తామన్నారు. తాము దీనిని ప్రజా ఉద్యమంగా మారుస్తామన్నారు. పెద్ద ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుడతామన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేధింపులను అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించడానికి, శాంతిభద్రతలను కాపాడేందుకు తమ సర్కార్ కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
CM Chandrababu Serios Warning
శాంతిభద్రతలు, సోషల్ మీడియాసపై కీలకమైన చర్చ జరిగింది శాసన సభలో. మహిళలపై నేరాలు చేసే వారిపై, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నకిలీ ప్రచారాలు చేసే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసింగ్ వ్యవస్థ క్షీణించిందని, అయితే అన్ని విభాగాల పనితీరును సంస్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వ అరాచకత్వానికి తాను మొదటి బాధితుడినని వాపోయారు. తనను అరెస్టు చేసి, జైలులో పెట్టి, డ్రోన్లతో నిఘా పెట్టారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాను ప్రతీకార రాజకీయాలను నమ్మను. కానీ, ఎవరూ చట్టం నుండి తప్పించు కోలేరన్నారు.
Also Read : AP Heavy Rains Warning : ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్షాల హెచ్చరిక
