AP Heavy Rains Warning : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు భారీ వ‌ర్షాల హెచ్చ‌రిక‌

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం

Hello Telugu - AP Heavy Rains Warning

Hello Telugu - AP Heavy Rains Warning

Heavy Rains : అమ‌రావ‌తి : ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ (IMD) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉత్తర, మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం కేంద్రీకృత‌మైంద‌ని, శుక్ర‌వారం వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంద‌ని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది వాతావ‌ర‌ణ శాఖ‌. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు వ‌స్తాయ‌ని పేర్కొంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.

Heavy Rains Warning in AP

ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంద‌ని జాగ్ర‌త్తగా ఉండాల‌ని సూచించింది . తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయ‌ని, ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలోని భవనాలు వద్ద ఉండరాద‌ని హెచ్చ‌రించింది ఏపీ వాతావ‌ర‌ణ శాఖ‌. సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని పేర్కొన్నారు మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్. ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌లో సైతం వాన‌లు దంచి కొడుతున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్ కు అంత‌రాయం ఏర్ప‌డింది. రాజ‌ధాని హైద‌రాబాద్ వ‌ర్షంలో తడిసి ముద్ద‌యింది.

Also Read : L&T – Metro Exit Warning : మెట్రో నుంచి వైదొలిగిన ఎల్ అండ్ టి

Exit mobile version