Yamuna River Sensational : య‌మునా న‌ది ఉగ్ర‌రూపం ఢిల్లీ అత‌లాకుత‌లం

లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తం

Hello Telugu - Yamuna River Sensational

Hello Telugu - Yamuna River Sensational

Yamuna River : ఢిల్లీ – ఢిల్లీ వాసులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. య‌మునా న‌ది ఉగ్ర రూపం దాల్చుతోంది. ప్ర‌మాద‌క‌ర స్థాయిని దాటి ప్ర‌వ‌హిస్తోంది. దీంతో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు అధికారులు నానా తంటాలు ప‌డుతున్నారు. ఇదే స‌మ‌యంలో కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ స‌ర్కార్ ముందస్తు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల ఉధృతి కార‌ణంగా యమునా న‌దికి (Yamuna River) ప్ర‌వాహం పెరిగింది అంత‌కంత‌కూ. దీంతో 207 మీట‌ర్ల ఎత్తుకు చేరుకుంది. స‌మీప ప్రాంతాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. ఇదిలా ఉండ‌గా యమునా నది నీటి మట్టం పెరుగుతూనే ఉండటంతో ప్రజలు వరద ప్రాంతం గుండా ప్రయాణించడానికి పడవల‌ను ఆశ్ర‌యించారు.

Yamuna River Huge Flow

ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే వంతెన వద్ద యమునా నదిలో నీటి మట్టం గురువారం ఉదయం 7 గంటలకు 207.48 మీటర్లకు చేరుకుంది, అయినప్పటికీ ఉగ్రంగా ప్రవహించే నది నుండి వరద నీరు సమీప ప్రాంతాలను ముంచెత్తుతూనే ఉంది. అధికారిక డేటా ప్రకారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్య 207.48 మీటర్ల వద్ద నీటి మట్టం స్థిరంగా ఉంది. ఉదయం 5 గంటలకు 207.47 మీటర్ల వద్ద నీటి మట్టం ఉండగా, ఉదయం 6 గంటలకు 207.48 మీటర్ల వద్ద ఉంది. అర్ధ‌రాత్రి 2 నుండి 5 గంటల మధ్య నీటి మట్టం స్థిరంగా ఉంది.

ఇదిలా ఉండ‌గా ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు, కీలక అధికారుల కార్యాలయాలు ఉన్న ఢిల్లీ సెక్రటేరియట్ సమీపంలో వరద నీరు చేరుకుంది. వాసుదేవ్ ఘాట్ పరిసర ప్రాంతాలు కూడా వరదల్లో మునిగి పోయాయి. కాశ్మీరీ గేట్ సమీపంలోని శ్రీ మార్గట్ వాలే హనుమాన్ బాబా మందిర్‌లోకి కూడా వరద నీరు చేరింది. రెవెన్యూ శాఖ ప్రకారం 8,018 మందిని టెంట్లకు తరలించారు. 2,030 మందిని 13 శాశ్వత షెల్టర్లకు తరలించారు. భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నొక్కి చెప్పింది.

Also Read : Putin Strong Warning : చ‌ర్చ‌ల‌కు రెడీ కాదంటే దాడులు త‌ప్ప‌వు : పుతిన్

Exit mobile version