CM Chandrababu : అమరావతి – మాజీ సీఎం జగన్ రడ్డిపై నిప్పులు చెరిగారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). పదే పదే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేస్తున్న తనకు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇస్తారని, ప్రభుత్వం ఇవ్వదని తెలుసుకుంటే మంచిదని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఏ పార్టీని ఎక్కడ పెట్టాలో తాము నిర్ణయించమని, జనమే డిసైడ్ చేస్తారన్నారు. మీరు చేసిన అరాచకాలు చూసి 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా బుద్ది రాలేదన్నారు సీఎం. గురువారం సీఎం మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో సర్వ నాశనం అయ్యిందన్నారు చంద్రబాబు నాయుడు.
CM Chandrababu Slams Ex CM YS Jagan
ఇదే సమయంలో 1994లో 26 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం హోదా ఇవ్వ లేదన్నారు . కానీ ప్రజాస్వామ్యం ఏంటో తెలుసు కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారని గుర్తు చేశారు ఏపీ సీఎం. గతంలో లాగా జగన్ మోహన్ రెడ్డి, ఆయన పరివారం బ్లాక్ మెయిల్ చేస్తూ బతికారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యం చెలాయించారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఇవాళ కూటమి పాలనలో ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. పాడై పోయిన వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కానీ అడుగడుగునా అడ్డుకునే సాంప్రదాయానికి తెర తీశారని, తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు.
ఇవాళ యూరియా కొరత లేకున్నా ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు నారా చంద్రబాబు నాయుడు. ప్రజలు ప్రతిపక్ష హోదా అన్నది లేకుండా చేసినా ఇంకా జగన్ రెడ్డి మారక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
Also Read : PVN Madhav Shocking Comments : బీఆర్ఎస్ పార్టీ దగాకోరు పార్టీ : పీవీఎన్ మాధవ్
