Akunuri Murali Shocking Comments : విద్యా శాఖ‌పై సీఎం దృష్టి సారించాలి

విద్యా శాఖ క‌మిష‌న్ చైర్మ‌న్ ఆకునూరి మురళి

Hello Telugu - Akunuri Murali Shocking Comments

Hello Telugu - Akunuri Murali Shocking Comments

Akunuri Murali : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర విద్యా క‌మిష‌న్ చైర్మ‌న్ ఆకునూరి ముర‌ళి (Akunuri Murali) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై. ప్ర‌స్తుతం విద్యా శాఖ దారుణంగా త‌యారైంద‌ని వాపోయారు. విద్యా శాఖ విషయంలో సీఎం తీరు సరిగా లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన ఈ శాఖకు ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి లేక పోతే విద్యార్థుల భ‌విష్య‌త్తు ఇబ్బందిగా మారుతుంద‌న్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి టైం ఈజ్ రన్నింగ్ ఔట్. రెండేళ్లు అయి పోయాయి అప్పుడే. చివరి సంవత్సరం ఎన్నికలే ఉంటాయి. కాబట్టి మధ్యలో ఉన్నది రెండేళ్లేన‌ని గుర్తు పెట్టుకోవాల‌ని అన్నారు ఆకునూరి ముర‌ళి.

Akunuri Murali Key Comments

ఈ ప్రభుత్వం విద్యా రంగం కోసం ఇంకా ఎక్కువ సమయం, వనరులు, బడ్జెట్ వెచ్చించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి, అధికారులు ఈ రంగంలో ఇంకా ఎక్కువ పని చేయాలని అన్నారు. ఈ మధ్య నిర్లక్ష్యం కొంచెం ఎక్కువనే అయ్యింది.. అది కరెక్ట్ కాద‌న్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత లేక పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారని, తాము జ‌రిపిన ప‌రిశీలన‌లో తేలింద‌న్నారు ఆకునూరి ముర‌ళి. ఇప్ప‌టికే స‌ర్కార్ కు నివేదిక ఇచ్చామ‌న్నారు. మధ్యాహ్న భోజనం వండే స్వయం సహాయక గ్రూపుల మహిళలు స్వంత పైసలు పెట్టుబడి పెట్టి పిల్లలకు వండిపెడుతున్నారని వాపోయారు.

వారికి రాష్ట్ర ప్రభుత్వం సమయానికి బిల్లులు చెల్లించక పోవ‌డంతో అప్పుల పాలవుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు విద్యా క‌మిష‌న్ చైర్మ‌న్. వారికి ఎప్పుడో అయిదేళ్ల క్రితం రేట్లు ఇస్తే వారు ఎలా బతక గలుగుతారంటూ ప్ర‌శ్నంచారు. వారికి వారానికొకసారి చెల్లింపులు జరపాలని, మూడు నెలలకు, ఆరు నెలలకు ఇస్తే వారికి ఇబ్బంది అవుతుంద‌ని సూచించామ‌న్నారు. తాము కొన్ని సూచనలతో మూడు నెలల క్రితం విద్యాశాఖకు రిపోర్టు ఇస్తే అస్సలు పట్టించు కోవడం లేదన్నారు.

Also Read : CP Radhakrishnan Important Meet : ప్ర‌ధాని మోదీని క‌లిసిన సీపీ రాధాకృష్ణ‌న్

Exit mobile version