CM Chandrababu Strong Comments : మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం : సీఎం

న్యాయ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనద‌న్న చంద్ర‌బాబు

Hello Telugu - CM Chandrababu Strong Comments

Hello Telugu - CM Chandrababu Strong Comments

CM Chandrababu : విశాఖ‌ప‌ట్నం : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌ధ్యవ‌ర్తిత్వం ద్వారానే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం అవుతుంద‌న్నారు . విశాఖ అందమైన నగరమని అందరికీ తెలుసు అన్నారు. సుందరమైన విశాఖలో బీచ్‌లు, పర్యాటక ఆతిథ్యం మరచి పోలేనిద‌ని పేర్కొన్నారు. విశాఖకు వచ్చిన ఎవరికైనా ఇక్కడే ఉండి పోవాలని అనిపిస్తుంద‌ని చెప్పారు. మహిళలకు అత్యంత భద్రత కలిగిన నగరంగా విశాఖ మారి పోయింద‌న్నారు సీఎం. ఈ క్ర‌మంలో న్యాయ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనద‌ని స్ప‌ష్టం చేశారు.

CM Chandrababu Key Comments

కొన్ని కేసులు జాప్యం కావచ్చుగానీ, చాలా కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). ప్రజలకు న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందన్నారు. ఏదైనా సమస్యను ఇరుపక్షాలు ఆమోద యోగ్యంగా పరిష్కరించు కోవడానికి సహకరించాల‌ని పేర్కొన్నారు. ఏ స‌మ‌స్య‌కైనా మధ్య వర్తిత్వం అనేది అత్యంత ముఖ్య‌మ‌న్నారు. దీనిని నిర్వహించడానికి మధ్యవర్తికి మెళకువలు అవసర‌మ‌ని పేర్కొన్నారు. దీని ద్వారా త‌క్ష‌ణ ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

న్యాయం పొందడం తమ హక్కు అని ప్రజలు కోర్టులకు వస్తుంటారని చెప్పారు. నూతన సాంకేతికత వినియోగంలో భారత్‌ పరుగులు పెడుతోందని అన్నారు. ఇది భార‌తీయులంద‌రికీ శుభ సూచ‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. శుక్ర‌వారం జ‌రిగిన ఇంటర్నేషనల్‌ మీడియేషన్‌ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్ర‌సంగించారు.

Also Read : Home Minister Anitha Shocking Comments : యూరియా కుంభ‌కోణం అబ‌ద్దం : అనిత

Exit mobile version