CM Chandrababu : శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబాపై. శనివారం శ్రీ సత్యసాయి శతాబ్ది ఉత్సవాలలో భాగంగా జరిగిన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆమెతో పాటు సీఎం కూడా పాల్గొని ప్రసంగించారు. శ్రీ సత్యసాయి బాబాతో తనకు ఉన్న బంధం మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆయన ఎల్లప్పుడూ బంగారూ అని ప్రతి ఒక్కరిని పిలిచే వారని అన్నారు సీఎం. ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉండు, ఎవరినీ నొప్పించ వద్దు అనే సిద్ధాంతాన్ని ప్రవచించి, ఆచరించి చూపిన మహనీయుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు.
CM Chandrababu CM Chandrababu Praises Sathya Saibaba
ఆయన భౌతికంగా లేక పోయినా ఇప్పటికీ , ఎప్పటికీ సూర్య చంద్రలు ఉన్నంత కాలం నిలిచే ఉంటారని, ప్రతి ఒక్కరి మదిలో కదలాడుతూనే ఉంటారని చెప్పారు సీఎం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాలను ఆయన మానవాళికి ప్రబోధించారని అన్నారు. ఈ ఉత్సవాలలో భాగం పంచు కోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి బాబా ఆంధ్రప్రదేశ్ తో బాటు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన తీసుకున్న చొరవ కారణంగా ఎంతో మందికి దాహం తీరిందన్నారు. ఆనాడు నెలకొన్న పరిస్థితులను తలుచుకుంటే బాధ కలుగుతుందన్నారు.
Also Read : Minister Narayana Clear Update on Amaravati : రాజధానిలో ప్రతి రైతుకు న్యాయం చేస్తాం
