Minister Narayana Clear Update on Amaravati : రాజధానిలో ప్రతి రైతుకు న్యాయం చేస్తాం

ప్ర‌క‌టించిన మంత్రి పొంగూరు నారాయ‌ణ

Hello Telugu - Minister Narayana Clear Update on Amaravati

Hello Telugu - Minister Narayana Clear Update on Amaravati

Minister Narayana : అమ‌రావ‌తి : ఏపీ మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తి రాజధానిలో ప్రతి రైతుకు న్యాయం చేస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. అంతే కాకుండా కేవ‌లం రాబోయే ఆరు నెల‌ల లోపు అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం రాయపూడి లోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై కమిటీ సమావేశం జ‌రిగింది. ఈ కీల‌క మీటింగ్ కు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర‌శేఖ‌ర్ , మంత్రి నారాయణ (Minister Narayana), ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీయే ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. స‌మావేశం ముగిసిన అనంత‌రం పొంగూరు నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు.

Minister Narayana Key Comments on Amaravati Farmers

అంశాల వారీగా ఒక్కొక్క సమస్యపై క‌మిటీ చ‌ర్చించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ప్రతి రోజూ ప్లాట్ ల రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయని వెల్ల‌డించారు. ఇంకా కేవలం 719 ఎకరాలకు మాత్రమే ప్లాట్ లు కేటాయించాల్సి ఉందన్నారు నారాయ‌ణ‌. గత ప్రభుత్వంలో రైతుల పోరాటాలు, చేసిన త్యాగాలు ఎవరూ మరిచి పోలేదన్నారు. గతంలో కొలువు తీరిన జ‌గ‌న్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. ఇంకా కొన్ని స‌మ‌స్య‌లు మాత్ర‌మే ఉన్నాయ‌ని, వాటిని త్వరిత‌గ‌తిన ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. క‌మిటీ ఆరు నెల‌ల స‌మ‌యం పెట్టుకుంద‌ని, అంత లోపే వాటిని ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. జరీబు, మెట్ట భూములకు సంబంధించి క్షేత్ర స్థాయిలో వెరిఫై చేస్తామ‌న్నారు.

Also Read : President Murmu Important Comments on Saibaba : ప్ర‌శాంత‌త‌కు నిల‌యం ప్ర‌శాంతి నిల‌యం

Exit mobile version