CM Chandrababu : దుబాయ్ : రాష్ట్రంలో ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్బంగా దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆరా తీశారు. రాష్ట్ర మంత్రులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, ఆర్టీజీ అధికారులతో మాట్లాడారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
CM Chandrababu Comments
ప్రాణ, ఆస్తి నష్టం జరగ్గకుండా చర్యలు చేపట్టాలని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోనీ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో ఇప్పటికే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్టు సీఎంకు వివరించారు. కాలువలు, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని సూచించారు. అంటు వ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి, బాధితులకు భరోసా కల్పించాలని అన్నారు. అంతే కాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు.
Also Read : AP Rains Sensational : బలహీన పడిన అల్పపీడనం జర భద్రం
