AP Rains Sensational : బలహీన పడిన అల్పపీడనం జ‌ర భ‌ద్రం

ఏపీ రాష్ట్రంలో కురుస్తున్న వ‌ర్షాలు

Hello Telugu - AP Rains Sensational

Hello Telugu - AP Rains Sensational

AP Rains : అమ‌రావ‌తి : రాష్ట్రంలో ఎడ తెరిపి లేకుండా వ‌ర్షాలు (AP Rains) కురుస్తాయ‌ని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌, వాతావ‌ర‌ణ శాఖ స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్బంగా ఉత్త‌ర త‌మిళ‌నాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో కొనసాగుతోంది అల్పపీడనం. రాబోయే 24 గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉంద‌న్నారు వాతావ‌ర‌ణ శాఖ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయ‌ని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు వ‌స్తాయ‌ని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ప‌డుతాయ‌ని పేర్కొన్నారు. తీరం వెంబడి 30-5 0కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయ‌ని వెల్ల‌డించారు మేనేజింగ్ డైరెక్ట‌ర్.

AP Rains Sensational

ఇదిలా ఉండ‌గా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అవ‌స‌ర‌మైతే బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించారు. అంతే కాకుండా మ‌త్స్య‌కారులు స‌ముద్రంలోకి చేప‌లు ప‌ట్టేందుకు వెళ్ల వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌త్యేకించి శిథిలావ‌స్థ భ‌వ‌నాలు, నిర్మాణాల‌లో ఉండ వ‌ద్ద‌ని సూచించారు. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు ప్ర‌ఖ‌ర్ జైన్. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు గురువారం స‌మీక్ష చేప‌ట్టారు రాష్ట్ర హోం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ముందు జాగ్ర‌త్త‌గా లోత‌ట్టు ప్రాంత ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు.

Also Read : Jubilee Hills Nomination Reject List : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో 130 నామినేష‌న్లు తిర‌స్క‌ర‌ణ

Exit mobile version