CM Chandrababu : అమరావతి : ఈ దేశానికి దిక్సూచి భారత రాజ్యంగం అని, అది కోట్లాది మందిని ప్రభావితం చేస్తూనే ఉంటుందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు. సభా సాంప్రదాయాలు పాటిస్తూ, అర్థవంతమైన చర్చలు చేశారు. సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు , సిఎస్ విజయానంద్ , మంత్రులు స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ నిర్వహణ చూసి ప్రశంసించారు. 45 వేల పాఠశాలల్లో మాక్ అసెంబ్లీని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
CM Chandrababu Key Comments
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు నారా చంద్రబాబు నాయుడు. భారత రాజ్యాంగం పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని పేర్కొన్నారు. ఇవాళ యావత్ భారతమంతా రాజ్యాంగ స్పూర్తిని స్మరించు కుంటోందని, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని గుర్తుకు తెచ్చుకుంటోందని చచెప్పారు సీఎం. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించి ఇప్పటికీ 76 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని, తద్వారా దేశ ప్రజలందరికీ సమాన హక్కులు దక్కాయన్నారు.
అమూల్యమైన రాజ్యాంగం కల్పించిన హక్కులను ఆస్వాదించే ప్రతి ఒక్కరూ బాధ్యతలను గుర్తెరిగి వ్యవహరించాలని. నవ సమాజం, సమ సమాజం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్ఫూర్తిని ఇవ్వాలని పేర్కొన్నారు.
Also Read : CM Revanth Reddy Important Update : ఎయిరో స్పేస్ హబ్ గా హైదరాబాద్
