CM Chandrababu Warning : సీజ‌న్ అయి పోయాక రుణాలు ఇస్తే ఎలా..?

బ్యాంక‌ర్ల‌ను నిల‌దీసిన చంద్ర‌బాబు నాయుడు

Hello Telugu - CM Chandrababu Warning

Hello Telugu - CM Chandrababu Warning

CM Chandrababu : అమ‌రావతి- ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బ్యాంక‌ర్ల ప‌నితీరుపై కొంత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జ‌రిగింది. 231 ఎస్‌ఎల్‌బీసీలో నిర్ణయాలపై యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టుపై స‌మీక్షించారు. వన్‌ ఫ్యామిలీ వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ కార్యక్రమానికి బ్యాంకుల సహకారంపై చర్చ జ‌రిగింది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని స్ప‌ష్టం చేశారు.

CM Chandrababu Slams Bankers

ఖరీఫ్‌లో ఇప్పటికే సగం సమయం గడిచి పోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ పాటికే రైతులకు రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాల్సి ఉందన్నారు. ఇంకా ఎందుకు ఇవ్వ‌కుండా ఉన్నారో పునారాలోచించు కోవాల‌న్నారు. సీజన్‌ ఆఖరులో రుణాల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండ‌ద‌న్నారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లూ తీరు మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఓవైపు టెక్నాల‌జీ పెను మార్పుల‌కు లోన‌వుతుంద‌ని చెప్పారు.

కేంద్రం జీఎస్టీలో సంస్కరణలను తీసుకొచ్చింది. బ్యాంకులు, పబ్లిక్‌ పాలసీలు ఎప్పుడూ ప్రజలను నియంత్రించ కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. తదుపరి సంస్కరణల దిశగా ప్రజలను ప్రోత్సహించాల‌ని చెప్పారు. . అమెరికా, చైనా లాంటి దేశాలకు సవాల్‌ విసిరేలా మన ఆర్థిక వ్యవస్థ తయారవుతోందన్నారు. ఉత్పాదకత లేని రుణాలు కూడా మంచివి కావన్నారు. పేదలు-ధనికుల మధ్య అంతరాలు తగ్గేందుకు చర్యలు చేపట్టాలని స్ప‌ష్టం చేశారు.

Also Read : Minister Savitha Interesting Comments : టీడీపీ రాజకీయ యూనివర్శిటీ : స‌విత‌

Exit mobile version