Minister Savitha Interesting Comments : టీడీపీ రాజకీయ యూనివర్శిటీ : స‌విత‌

తెలుగు తమ్ముళ్లు కాలర్ ఎగరేసేలా చంద్రన్న పాలన

Hello Telugu - Minister Savitha Interesting Comments

Hello Telugu - Minister Savitha Interesting Comments

Minister Savitha : తిరుపతి : రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో నాయకులు తెలుగుదేశం పార్టీలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారని, టీడీపీ రాజకీయ యూనివర్శిటీ అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. టీడీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తల పార్టీ అని స్పష్టం చేశారు. తిరుపతిలోని రేణిగుంటలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్ టీడీపీ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి సవిత (Minister Savitha) మాట్లాడారు. టీడీపీ కార్యకర్తల పార్టీ అని అన్నారు.

Minister Savitha Key Comments

పనిచేసిన వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని, ఇందుకు ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్ పదవులే నిదర్శమని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన తనతో పాటు మరెందరికో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రోత్సాహించారన్నారు. టీడీపీ మాదిరిగా మరే పార్టీలోనూ కార్యకర్తలకు గుర్తింపు ఉండదన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్నారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ సీఎం చంద్రబాబు నాయుడు నెర వేర్చుతున్నారని మంత్రి సవిత తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా సీఎం చంద్రబాబు అమలు చేశారన్నారు.

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్కడి నాయకులు సమిష్టిగా పనిచేసి, జగన్ కోటను బద్ధలు కొట్టారని, వైసీపీకి డిపాజిట్లు కూడా రాలేదని మంత్రి సవిత తెలిపారు. అదే సమిష్టి స్ఫూర్తితో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పనిచేసి, విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు పాలనపై ప్రజల్లో సానుకూల దృక్పథం వ్యక్తమవుతోందని, టీడీపీ కార్యకర్తలంతా ఐక్యంగా, సమిష్టిగా పనిచేస్తే, రాష్ట్రంలో ఏ ఎన్నికల జరిగినా పులివెందుల జెడ్పీటసీ ఉప ఎన్నిక ఫలితమే పునరావృత మవుతుందన్నారు.

Also Read : YS Sharmila Fired on AP Govt : దివ్యాంగుల పొట్ట కొడితే ఎలా..?

Exit mobile version