CM Chandrababu Important Comments : జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల‌తో పేద‌ల‌కు ల‌బ్ది : సీఎం

పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌ని పిలుపు

Hello Telugu - CM Chandrababu Important Comments

Hello Telugu - CM Chandrababu Important Comments

CM Chandrababu : అమరావతి : జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల‌తో పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ల‌బ్ది జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). ఆదివారం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామ స్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల వ‌ల్ల అన్ని వ‌ర్గాల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. దేశంలో ఇదొక నూతన అధ్యాయం మొద‌లైంద‌న్నారు సీఎం. జీఎస్టీ సంస్కరణలతో ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులను ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. జీఎస్టీ ఉత్సవ్‌లో భాగంగా జీఎస్టీ సంస్కరణలను వివరించాల‌ని సూచించారు సీఎం. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించాలని స్ప‌ష్టంచేశారు. కూటమి పార్టీలు ఉమ్మడిగా జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం చేప‌ట్టాల‌న్నారు.

CM Chandrababu Key Comments on GST Reforms

పారిశ్రామిక, ఆటో మొబైల్, ఫార్మా, వంటి కంపెనీలకు జీఎస్టీ సంస్కరణలో మేలు జరుగుతుందన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. టూ వీలర్, ఏసీలు, కార్లు, వంటి ఇంటి వస్తువుల ధరలు తగ్గుతాయ‌ని పేర్కొన్నారు. ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువులకు తగ్గాయ‌న్నారు. రోగులు వాడే మందులపై జీఎస్టీ లేదన్నారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామ‌న్నారు సీఎం.
జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు రూ. 8 వేల కోట్ల మేర లబ్ది జరగుతుందని చెప్పారు. మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గినా సంస్కరణల వల్ల ప్రజలు ఆర్థికంగా బలోపేతం అవుతారని పేర్కొన్నారు. సుపరిపాలన కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం చేశామో వివరించాం అన్నారు.

Also Read : TVK Vijay Important Comments : క‌రూర్ ఘ‌ట‌న బాధాక‌రం విజ‌య్ ప్ర‌గాఢ సంతాపం

Exit mobile version