TVK Vijay Important Comments : క‌రూర్ ఘ‌ట‌న బాధాక‌రం విజ‌య్ ప్ర‌గాఢ సంతాపం

40 మంది మృతి చెంద‌డంతో నా గుండె బ‌రువెక్కింది

Hello Telugu - TVK Vijay Important Comments

Hello Telugu - TVK Vijay Important Comments

TVK Vijay : చెన్నై : త‌మిళ‌నాడులోని క‌రూర్ లో తాను నిర్వ‌హించిన ఎన్నిక‌ల ర్యాలీ తీవ్ర విషాదం నెల‌కొనేలా చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు టీవీకే పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ (TVK Vijay). ఆదివారం ఆయ‌న సామాజిక మాధ్య‌మం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఆరుగురు చిన్నారుల‌తోపాటు 16 మందికి పైగా మ‌హిళ‌లు ఉన్నారు. ఇంకా ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్న స‌మాచారం అంద‌డంతో తీవ్ర ఆవేద‌న చెందుతున్న‌ట్లు తెలిపారు. త‌న గుండె బ‌రువు ఎక్కింద‌న్నారు. మృతి చెందిన కుటుంబాల‌కు ఒక్కో కుటుంబానికి రూ. 20 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతే కాకుండా క్ష‌త‌గాత్రుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే వైద్య ఖ‌ర్చుల‌ను తాను భ‌రిస్తాన‌ని వెల్ల‌డించారు.

TVK Vijay Comments

ఊహకు అందని విధంగా నా హృదయం, మనస్సు తీవ్ర భారంతో మునిగి పోయంద‌న్నారు. మన ప్రియమైన వారిని కోల్పోయిన అపారమైన దుఃఖం మధ్యలో, నా హృదయం భరించే బాధను వ్యక్తపరచడానికి నాకు మాటలు దొరకడం లేదన్నారు విజ‌య్ . నా కళ్ళు, మనస్సు దుఃఖంతో మబ్బుగా ఉన్నాయని పేర్కొన్నారు. మీరు నాప‌ట్ల చూపించిన ప్రేమ‌కు, అభిమానానికి ఎల్ల‌వేళ‌లా రుణ‌ప‌డి ఉంటాన‌ని, కానీ ఈ విషాద స‌మ‌యంలో నా ఆత్మీయుల‌ను కోల్పోవ‌డం మ‌రింత త‌న‌ను బాధ‌కు గురి చేసింద‌న్నారు టీవీకే పార్టీ చీఫ్‌. గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న ప్ర‌తి ఒక్క‌రికి రూ. 2 లక్ష‌ల చొప్పున అంద‌జేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఆ దేవుడు మీ అంద‌రి ఆత్మ‌ల‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు.

Also Read : India Govt Serious Warning : క‌రూర్ ఘ‌ట‌న‌పై కేంద్రం సీరియ‌స్

Exit mobile version