CM Chandrababu Strong Focus : ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై సీఎం ఫోక‌స్..?

ఆగస్టు 6న మంత్రివర్గ విస్తర‌ణ‌కు ముహూర్తం

Hello Telugu CM Chandrababu Strong Focus

Hello Telugu CM Chandrababu Strong Focus

CM Chandrababu : అమ‌రావ‌తి – ఏపీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరింది. ఇందులో తెలుగుదేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలు క‌లిసి ఉమ్మ‌డిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. చంద్ర‌బాబు కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల ముఖ్య భూమిక పోషించారు. ఇప్ప‌టికే ప‌లువురికి కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు చేస్తూ వ‌స్తున్నారు చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). కొంద‌రి ప‌నితీరు ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం ఆ మ‌ధ్య‌న క‌ల‌క‌లం రేపుతోంది.

CM Chandrababu Focus on

దీంతో కొంద‌రికి ప్ర‌స్తుత మంత్రివ‌ర్గంలో ఉన్న వారికి ఉద్వాస‌న ప‌లికి మ‌రికొందరికి ఛాన్స్ ఇవ్వాల‌ని యోచిస్తున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌స్తుతం ఉన్న వారిలో ఎనిమిది మందిపై వేటు వేసే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. సీనియ‌ర్ల‌కు ఈసారి ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇవ్వ‌నున్నారు చంద్రబాబు నాయుడు. రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేల‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌నుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రాంతాల వారీగా స‌ర్దుబాటు చేసి, మిగ‌తా వారికి కీల‌క‌మైన ప‌దవులు అప్ప‌గించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్లు టాక్.

విచిత్రం ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి ఆయువు ప‌ట్టుగా ఉన్న అనంత‌పురం జిల్లాకు చెందిన దివంగ‌త మంత్రి ప‌రిటాల ర‌వీంద్ర ఫ్యామిలీలో త‌న భార్య ప‌రిటాల సునీత ఎమ్మెల్యేగా గెలుపొందినా త‌న‌కు కేబినెట్ లో చోటు ద‌క్క‌లేదు. కాల్వ శ్రీ‌నివాసులు, ప‌య్యావుల కేశ‌వ్ కు ఛాన్స్ ఇచ్చారు. ఈసారి జ‌రిగే కేబినెట్ లో సునీత‌కు అవ‌కాశం ఇస్తారా లేదా అన్న‌ది తేలాల్సి ఉంది.

Also Read : Ex IPS AB Venkateswarao Shocking Comments : వైసీపీ నేత‌ల ఆగ‌డాల‌పై ఏబీ ఆగ్ర‌హం

Exit mobile version