Ex IPS AB Venkateswarao Shocking Comments : వైసీపీ నేత‌ల ఆగ‌డాల‌పై ఏబీ ఆగ్ర‌హం

అరిక‌ట్ట‌క పోతే ఎలా అని పోలీసుల‌పై ఫైర్

Hello Telugu - Ex IPS AB Venkateswarao Shocking Comments

Hello Telugu - Ex IPS AB Venkateswarao Shocking Comments

AB Venkateswarao : అమ‌రావ‌తి – ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర్ రావు (AB Venkateswarao) సీరియ‌స్ అయ్యారు. ఆయ‌న వైసీపీ నేత‌ల ఆగ‌డాలు మితిమీరి పోయాయ‌ని అన్నారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరినా వీరి దౌర్జ‌న్యాల‌కు అడ్డు అదుపు లేకుండా పోయాయ‌ని ఆరోపించారు. తాను ద‌త్త‌త తీసుకున్న ముక్కొళ్లుపాడు గ్రామాన్ని సంద‌ర్శించారు. గ్రామంలో వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలపై ప్రశ్నించారు ఏబి వెంకటేశ్వరరావు.

AB Venkateswarao Key Comments

కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వైసిపి గుండాలు చేస్తున్న అరాచకాలను అరికట్టలేక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ముక్కొళ్ళుపాడు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా మహిళా సంఘాల బుక్ కీపర్ ను తొలగించేందుకు ప్రయత్నాలు చేసిన గ్రామ ఉపసర్పంచ్ కలగర శివసాయిపై ఫైర్ అయ్యారు. టిడిపి కార్యకర్తలు, నాయకులు, మహిళలపై దాడులకు తెగ పడుతున్న శివ సాయిపై నూజివీడు రూరల్, పట్టణ పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని నిల‌దీశారు ఏబీ వేంక‌టేశ్వ‌ర్ రావు.

గత ప్రభుత్వంలో అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో మదమెక్కి గ్రామంలో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. బుక్ కీపర్ పదవికి రాజీనామా చేయకపోతే పద్మ అనే మహిళను చంపేస్తామని బెదిరించడంతోపాటు దాడి చేసి చెయ్యి విరగొట్ట‌డంపై మండిప‌డ్డారు. డ్వాక్రా మహిళా సంఘాలను ఆటో ఎక్కించుకున్నాడన్న కారణంగా ఆటో డ్రైవర్ పై దాడి చేస్తే, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం శోచనీయమ‌న్నారు. వైసీపీ నుండి టిడిపిలోకి మారి మళ్లీ వాళ్లే పెత్తనం చెలాయిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. వైసిపి గుండాలు చేస్తున్న అరాచకాలు మంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వెళుతుందని భావిస్తున్నానని అన్నారు.

Also Read : Minister Kondapalli Srinivas Interesting : మ‌హిళా సంఘాల కోసం రూ. 30,635 కోట్ల‌తో ప్ర‌ణాళిక

Exit mobile version