CM Chandrababu Interesting Comments : ఇథనాల్ ప్లాంట్లతో పర్యావరణానికి మేలు : సీఎం

పశు పోషణతో పాడి రైతులకు ఆర్థికాభివృద్ధి

Hello Telugu - CM Chandrababu Interesting Comments

Hello Telugu - CM Chandrababu Interesting Comments

CM Chandrababu : నెల్లూరు జిల్లా : పోర్టులు, ఎయిర్ పోర్టులతో రాష్ట్రం ఆర్థికాభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఈదగాలి గ్రామంలో విశ్వసముద్ర గ్రూపునకు చెందిన వివిధ ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. ఇథనాల్ ప్లాంట్, నంద గోకులం లైఫ్ స్కూల్, సేవ్ ద బుల్, పవర్ ఆఫ్ బుల్ ప్రాజెక్టులను ప్రారంభించి పరిశీలించారు. నంద గోకులం లైఫ్ స్కూల్ విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు కీలక పరిశ్రమలు వచ్చాయని చెప్పారు. కృష్ణ పట్నం, రామాయపట్నం, దుగరాజ పట్నం పోర్టులు జిల్లా అభివృద్ధికి కీలకంగా మారతాయన్నారు.

CM Chandrababu Comments

దగదర్తి విమానాశ్రయం త్వరలోనే వస్తుందని ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు. బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ , క్రిబ్ కో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడా రాబోతున్నాయని వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రగతిలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో నెల్లూరు జిల్లా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఇదే సమయంలో జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం లేదన్నారు. సోమశిల, కండలేరు లాంటి మంచి ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాలో ఉన్నాయన్నారు సీఎం. 150 టీఎంసీల నీళ్లు ఈ రెండు ప్రాజెక్టుల్లో ఉంటాయ‌ని చెప్పారు. భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ఈ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఉంచుతామ‌న్నారు చంద్ర‌బాబు నాయుడు. ఏ ప్రాజెక్టులు చేపట్టినా , రాష్ట్రానికి ఆర్థికంగా ఉపయోగ పడడంతో పాటు పర్యావరణ హితంగా ఉండాలని స్ప‌ష్టం చేశారు.

Also Read : Minister Vasamsetty Fired on YS Jagan : అధికారం పోయినా జ‌గ‌న్ తీరు మార‌లేదు

Exit mobile version