Minister Vasamsetty Fired on YS Jagan : అధికారం పోయినా జ‌గ‌న్ తీరు మార‌లేదు

కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్

Hello Telugu - Minister Vasamsetty Fired on YS Jagan

Hello Telugu - Minister Vasamsetty Fired on YS Jagan

Minister Vasamsetty : అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాస్ (Minister Vasamsetty) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. వైసీపీ బాస్, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో 11 సీట్ల‌కే ప‌రిమ‌తం చేసినా , ప్ర‌తిప‌క్ష హోదా అన్న‌ది ద‌క్క‌కుండా చేసినా బుద్ది రాలేద‌న్నారు. జ‌గ‌న్ రెడ్డి కూట‌మి స‌ర్కార్ కొలువు తీర‌డాన్ని చూసి త‌ట్టుకోలే పోతున్నార‌ని ఆరోపించారు. ప‌వ‌ర్ పోవ‌డంతో త‌ట్టుకోలేక పోతున్నాడ‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు వాసంశెట్టి సుభాష్. కృష్ణా జిల్లా ఇంఛార్జ్ మంత్రి మీడియాతో మాట్లాడారు. రోజు రోజుకు వైసీపీ నేత‌లు దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ ఆరోపించారు. వైసీపీ నాయకులకు వీధి రౌడీలకు తేడా లేకుండా పోయింద‌న్నారు.

Minister Vasamsetty Slams Ex CM YS Jagan

తామ అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థను ఎలా భ్ర‌ష్టు ప‌ట్టించారో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుసున్నారు. అందుకే ముందు వెనుకా ఆలోచించ‌కుండా ఊహించ‌ని రీతిలో జ‌గ‌న్ రెడ్డికి, ఆయ‌న ప‌రివారానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఎన్నిక‌లు ముగిసినా, వారి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేద‌న్నారు వాసంశెట్టి సుభాష్. మచిలీపట్నంలోని ఆర్ఆర్ పేట లోని పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహరించిన తీరు ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌ను ఒక‌నాడు మంత్రి ప‌ద‌విని నిర్వ‌హించార‌న్న సోయి లేక పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులపై దౌర్జన్యానికి దిగటం, పోలీస్ స్టేషన్లోకి బలవంతంగా ప్రవేశించి నానా యాగి చేయడం వారి ప్రవర్తనకు నిదర్శనం అన్నారు. ఎంత‌టి వారైనా స‌రే చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు.

Also Read : Minister Savitha Important Update : మాన‌వ‌త్వాన్ని చాటుకున్న‌ మంత్రి స‌విత‌

Exit mobile version