APTDC Special Package Interesting : న‌వ‌రాత్రుల కోసం ఏపీటీడీసీ ప్ర‌త్యేక ప్యాకేజీ

భ‌క్తుల కోసం ప్ర‌త్యేక బ‌స్సు స‌దుపాయం

Hello Telugu - APTDC Special Package Interesting

Hello Telugu - APTDC Special Package Interesting

APTDC : విజ‌యవాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ది సంస్థ (ఏపీటీడీసీ) తీపి క‌బురు చెప్పింది భ‌క్తుల కోసం. ఈనెల 22 నుంచి వ‌చ్చే నెల అక్టోబ‌ర్ రాష్ట్ర వ్యాప్తంగా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు కొన‌సాగుతాయి. ప్ర‌త్యేకించి విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రి కొండ‌పై కొలువు తీరిన క‌న‌క‌దుర్గ‌మ్మ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే దేవాదాయ శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు చేస్తోంది. ఇప్ప‌టికే మంత్రులు ఆనం రామ నారాయ‌ణ రెడ్డితో పాటు వంగ‌ల‌పూడి అనిత హాజ‌ర‌య్యారు. ఏర్పాట్ల‌పై స‌మీక్ష చేప‌ట్టారు. ఇదిలా ఉండ‌గా అమ్మ వారిని ద‌ర్శించుకునేందుకు గాను ఏపీటీడీసీ (APTDC) ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు సంస్థ చైర్మ‌న్ బాలాజీ.

APTDC Updates

ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం శీఘ్ర దర్శన టిక్కెట్లు, మినీ వాహనాల కోసం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డిని క‌లిసి విన్న‌వించారు. శ్రీ కనకదుర్గమ్మ దసరా నవరాత్రుల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించామ‌న్నారు. గురువారం మంత్రిని క‌లిశామ‌ని చెప్పారు. ప్రత్యేక టూర్ ప్యాకేజీ గురించి వివరించారు. అనంతరం వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో ఏపీటీడీసీ చైర్మన్ బాలాజీ ఏమన్నారంటే సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు హైదరాబాదు – విజయవాడ ప్రత్యేక ప్యాకేజీ టూర్ ను కార్పొరేషన్ నిర్వహించంచాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. ఇందులో అమ్మవారి శీఘ్ర దర్శనం తో పాటు పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జ‌రుగుతుంద‌న్నారు..ఈ సందర్భంలో, రూ.500 విలువ గల 60 శీఘ్ర దర్శన టిక్కెట్లు మంజూరు చేయాలని, అలాగే 12 సీటర్ల మినీ వాహనాలను గిరిపాదం నుండి ఆలయ ప్రాంగణం వరకు నడిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక అనుభవం కలిగించే యాత్రా సేవలను అందించేందుకు కట్టుబడి ఉందని ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు.

Also Read : FM Nirmala Sitharaman Interesting : పెట్టుబడులకు వెనుకాడొద్దు – పరిశ్రమలకు సీతారామన్ పిలుపు

Exit mobile version