CM Chandrababu Clear Orders : 2 ఏళ్లలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి కావాలి

ప్రాధాన్యం తో శ్రీశైలం డ్యామ్ రక్షణ పనులు

Hello Telugu - CM Chandrababu Clear Orders

Hello Telugu - CM Chandrababu Clear Orders

CM Chandrababu : అమరావతి : రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి అనేది తలెత్తకూడదని, అన్ని కాలాల్లోనూ జల వనరులు సమృద్ధిగా లభించేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆదేశించారు. ఒక ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోయినా, ఎగువ రాష్ట్రాల నుంచి వరద జలాలు రాకున్నా ఎలాంటి ఇబ్బంది రాకుండా నీటి నిర్వహణ చేపట్టాలని స్పష్టం చేశారు. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షపాతం తక్కువుగా నమోదైందని, అయినప్పటికీ ఎక్కడా నీటి సమ్యస్య ఉత్పన్నం కానివ్వలేదని సీఎం అన్నారు. ఇది కేవలం సమర్ధ నీటి నిర్వహణతోనే సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత జలాశయాల నిల్వలు, నీటి నిర్వహణ, ప్రాజెక్టుల పురోగతి, భూగర్భజలాలు, తదితర అంశాలపై గురువారం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

CM Chandrababu Comments

రాష్ట్రంలో మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టుల్లో మొత్తం 1,313 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుండగా ఇప్పటి వరకు 1,031 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల్లో 79 శాతం నీరు నిల్వ ఉందని అన్నారు. సెప్టెంబర్ మొదటి వారానికే ఈ స్థాయికి నిండాయని వివరించారు. ఇందులో శ్రీశైలం సహా మేజర్ ప్రాజెక్టుల్లో 89 శాతం మేర, మీడియం జలాశయాలు 57 శాతం, మైనర్ ప్రాజెక్టుల్లో 39 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. సోమశిల, కండలేరు, బ్రహ్మంసాగర్ నింపే విషయంలో సమస్యలను పరిష్కరించాలని సీఎం అన్నారు.

Also Read : RBI Shocking Rule : ఇకపై మీరు లోన్ చెల్లించకపోతే మీ ఫోన్ లాక్ – ఆర్బీఐ

Exit mobile version