CM Chandrababu Challenge : జ‌గ‌న్ కు ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రావాలి : సీఎం

నిరాధారమైన ఆరోప‌ణ‌లు చేస్తే స‌హించేది లేదు

Hello Telugu - CM Chandrababu

Hello Telugu - CM Chandrababu

CM Chandrababu : చిత్తూరు జిల్లా – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న వైసీపీ బాస్, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ద‌మ్ము, ఖ‌లేజా ఉంటే శాస‌న స‌భ‌కు రావాల‌ని, అక్క‌డ దేనిపైనా చ‌ర్చ పెట్టినా తాము చ‌ర్చించేందుకు , జ‌వాబు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. చిత్తూరు జిల్లాలో సీఎం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా రాజంపేట‌లో నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu) మీడియాతో మాట్లాడాడు. ఎవ‌రిది విధ్వంస‌క‌ర‌మైన పాల‌న‌న‌లో, ఎవ‌రిది అభివృద్ది, సంక్షేమ‌క‌ర‌మైన పాల‌న జ‌రుగుతుందో పూర్తిగా చ‌ర్చిద్దామ‌ని పిలుపునిచ్చారు. లేని పోని ఆరోప‌ణ‌లు చేయ‌డం, రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించేలా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

CM Chandrababu Key Comments YS Jagan

తాను ఉన్నంత వ‌ర‌కు మీ ఆట‌లు సాగ‌వ‌న్నారు. ఎవ‌రైనా స‌రే, ఎంత‌టి వారైనా స‌రే, ఏ స్థాయిలో ఉన్నా స‌రే వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నారా చంద్ర‌బాబు నాయుడు. జ‌గ‌న్ ప‌దే ప‌దే త‌న ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఇలాంటి చిల్ల‌ర మ‌ల్ల‌ర కామెంట్స్ చేస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు సీఎం. ఇలాంటి వాళ్ల‌ను త‌న రాజ‌కీయ జీవితంలో చాలా మందిని చూశాన‌ని, ఆయ‌న ఓ లెక్కా అంటూ ఎద్దేవా చేశారు చంద్ర‌బాబు. ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్చ‌కు సిద్ద‌మైతే తాము కూడా అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు చంద్ర‌బాబు నాయుడు.

Also Read : MLC Kavitha Shocking Comments : కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర

Exit mobile version