MLC Kavitha Shocking Comments : కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సీరియ‌స్ కామెంట్స్

Hello Telugu - MLC Kavitha Shocking Comments

Hello Telugu - MLC Kavitha Shocking Comments

MLC Kavitha : హైద‌రాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత (MLC Kavitha) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా అని ప్ర‌శ్నించారు. వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారంటూ మండిప‌డ్డారు. అందుకే రెండవ టర్మ్ లో ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని చె్శారు. హరీష్ రావు, సంతోష్ వల్లనే కెసిఆర్ కి అవినీతి మరకలు అంటాయ‌న్నారు. త‌న‌పై కుట్ర‌లు చేసినా స‌హించాన‌ని, కానీ త‌న తండ్రిపై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తుంటే త‌ట్టుకోలేక పోతున్నాన‌ని వాపోయారు. ఆ ఇద్ద‌రి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడ‌ని మండిప‌డ్డారు.

MLC Kavitha Shocking Comments on Harish Rao

అవినీతి అనకొండలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్ర‌శ్నించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. త‌ను ఎవ‌రో ఆడిస్తే ఆట‌బొమ్మ‌ను కాన‌ని స్ప‌ష్టం చేశారు. సోష‌ల్ మీడియాలో త‌న‌పై హ‌రీశ్ రావు, సంతోష్ రావులు క‌లిసి ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాయిస్తున్నారంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా క‌ల్వకుంట్ల క‌విత తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. కేసీఆర్ పై సీబీఐ కేసులు పెట్టే స్థాయికి వ‌చ్చాక పార్టీ ఉటే ఎంత పోతే ఎంత అని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముందు హ‌రీశ్ రావు, సంతోష్ రావుల‌ను పార్టీ నుంచి తొల‌గిస్తేనే పార్టీ బ‌తికి బ‌ట్ట క‌డుతుంద‌న్నారు. లేక పోతే దానికి భవిష్య‌త్తు లేద‌న్నారు ఎమ్మెల్సీ. ఇదిలా ఉండ‌గా క‌విత చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఇదిలా ఉండ‌గా క‌విత చేసిన తాజా కామెంట్స్ పై కేసీఆర్ ఆరా తీశారు. దీనిపై హ‌రీశ్, కేటీఆర్, సంతోష్ ల‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

Also Read : CM Revanth Reddy Strong Instructions : జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డికి అంతా మ‌ద్ద‌తు ఇవ్వాలి

Exit mobile version