బీఆర్ఎస్ ఎమ్మెల్సీల‌ నిర్వాకం అప్ర‌జాస్వామికం

వాస్త‌వాలు తెలుసుకుని మాట్లాడాల‌ని కాంగ్రెస్ హిత‌వు

hellotelugu-CongressFire

హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేత‌ల నిర్వాకంపై మండిప‌డింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం త‌న సోష‌ల్ మీడియా ఎక్స్ హ్యాండిల్ లో ఎమ్మెల్సీ న‌వీన్ రెడ్డి ఓ పోలీస్ అధికారి కాల‌ర్ ప‌ట్టుకోవ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది. ఇందుకు సంబంధించి ఫోటోల‌ను కూడా షేర్ చేసింది. ఇప్పుడు వైర‌ల్ గా మారింది. కెమెరాలు మీ కళ్ల ముందే ఉన్నాయి. మీడియా అక్కడే ఉంది. పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు , ఉద్వేగ భరితమైన కార్యకర్తలు అందరూ అక్కడ ఉన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ అధికారిపై జరిగిన దాడిని, ఆయనను దూషించడాన్ని, కాలర్ పట్టుకుని కొట్టడానికి దూసుకెళ్లడాన్ని అందరూ చూశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అది ఎలా భంగం కలిగించిందో అందరూ గమనించారు.

గుమాస్తా తెలంగాణా, నీ భజన మీడియాకు ఇవేవీ కనిపించక పోయినా కేవలం వాస్తవాలను మాత్రమే చూపించే మీడియా సంస్థలు , సోషల్ మీడియా పేజీలు అసలు నిజాలను బయట పెట్టాయి. దొంగే రివర్స్ లో కానిస్టేబుల్ పై నిందలు వేసినట్లు” అన్న సామెతలా… పోలీసులపై దాడి చేసే నాటకాన్ని మీరే ఆడి, ఆ తర్వాత మీరే దెబ్బలు తిన్నట్లు చెప్పుకుంటూ, మీడియా ముందు గాయాలు ఉన్నట్లు చూపించడానికి ఇంజెక్షన్లు కూడా వేయించుకున్నారా? ఈ నాటకం ఎంతకాలం సాగుతుంది? అని ప్ర‌శ్నించింది. పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగక పోయినా, జరిగిందని ప్రజలను నమ్మించడం అంత సులభం కాదు. గతంలో మీ అబద్ధాలే నిజాలని ప్రజలను నమ్మించినట్లుగా ఇప్పుడు అది సాధ్యం కాదు.

ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా, “అక్రమ అరెస్టులు, నిర్బంధాలు” అంటూ తప్పుడు ప్రచారం చేయడం మీ రాజకీయ వక్రీకరణలకు నిదర్శనం. ఒకవైపు, మీరు ఇచ్చిన స్వేచ్ఛతో రెచ్చి పోయిన MLC నవీన్, ఒక పోలీసు అధికారి కాలర్ పట్టుకుని రౌడీలా ప్రవర్తించే స్థాయికి వెళ్లాడని ఆరోపించింది. మరోవైపు మధు దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను “ఆయన-ఈయన” అని సంబోధించడమే కాకుండా, తన స్థాయిని మర్చిపోయి అసభ్య పదజాలంతో స్పీకర్ పదవిని అవమానించారు. ఇవేవీ ఎవరూ కల్పించిన కథలు కావు. ఇవన్నీ కెమెరాలో రికార్డైన వాస్తవాలు. అయినా సరే “నవ్వించకండి… నాకే సిగ్గుగా ఉంది” అన్నట్లుగా, మీరు ఇంకా ప్రభుత్వంపై నిందలు వేస్తూనే ఉన్నారు. స్పీకర్‌ను అవమానించిన మీ ఎమ్మెల్సీలను అదుపులో ఉంచడానికి బదులుగా, బాధ్యతా రాహిత్యంగా వారిని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు… అది మీ రాజకీయ సంస్కృతినే దిగజారుస్తుంది. విలువలు లేని రాజకీయాలను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు.

అయినా సరే, మీరు అదే మార్గంలో కొనసాగుతుంటే. ప్రజలు ఇచ్చిన తీర్పు నుండి మీరు ఏమీ నేర్చుకోలేదని, మీకు ఇంకా జ్ఞానోదయం కాలేదని నిన్న రాత్రి స్పష్టమైంది. ప్రజలు మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టారో అర్థం చేసుకోకుండా అదే అహంకారంతో ముందుకు సాగితే భవిష్యత్తులో ప్రజలు మీకు ఇచ్చే సందర్భంలో, గతంలో చూపిన దానికంటే రెట్టింపు తీవ్రతతో వారు మీకు స్పందిస్తారని గుర్తు పెట్టుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది.

https://x.com/INCTelangana

Exit mobile version