CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నేతృత్వంలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన అంశాలు చర్చించాల్సిన అవసరం ఉందని ఈ మేరకు శాసన సభ సమావేశాలు మరిన్ని రోజులు పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా గురువారం ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. అంతకు ముందు బీఏసీ కీలక సమావేశం జరిగింది. ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.
CM Chandrababu Comments
సభలో చర్చించేందుకు 18 అంశాలు ప్రతిపాదించింది తెలుగుదేశం పార్టీ. సభలో చర్చించేందుకు 9 అంశాలు ప్రతిపాదన చేసింది భారతీయ జనతా పార్టీ. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్య గంటలోనూ మంత్రులు ఉండాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. జీఎస్టీ సంస్కరణలపై ఇవాళ శాసనసభలో చర్చ జరపాలని సూచించారు. జలవనరుల అంశంపై రేపు శాసనసభలో చర్చ జరపాలని నిర్ణయించారు. ఈ నెల 22న శాంతి భద్రతలు, 23న వైద్యారోగ్యంపై చర్చ జరపనున్నారు. ఈ నెల 24న పరిశ్రమలు, 25న సూపర్`6పై చర్చ, 26న క్వాంటం వ్యాలీ, 27న లాజిస్టిక్స్‌పై చర్చించనున్నారు. ఈ నెల 29న ‘స్వర్ణాంధ్ర దిశగా ఏపీ’ అంశంపై చర్చించనున్నారు. 30న రాయలసీమ-కోస్తా-ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చించనున్నారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబబు నాయుడు కీలక సూచనలు చేశారు. సమావేశాలలో ఆయా అంశాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. లేకపోతే ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు.
Also Read : MLA Battula Laxma Reddy Huge Donation : రైతుల కోసం ఎమ్మెల్యే రూ. 2 కోట్ల విరాళం
