CM Chandrababu Important Update on Modi : న‌రేంద్ర మోదీ పాల‌న‌కు 25 ఏళ్లు..బాబు కంగ్రాట్స్

పాల‌నా ద‌క్షుడిగా గుర్తింపు పొందారంటూ కితాబు

Hello Telugu - CM Chandrababu Important Update on Modi

Hello Telugu - CM Chandrababu Important Update on Modi

CM Chandrababu : అమ‌రావ‌తి : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాల‌నా ప‌రంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ త‌న జీవిత కాలంలో ముఖ్య‌మంత్రిగా, పీఎంగా అక్టోబ‌ర్ 8వ తేదీ నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని సీఎం శుభాకాంక్ష‌లు తెలిపారు. మీ నాయ‌క‌త్వంలో భార‌త్ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ముందు చూపు, దూర‌దృష్టి, నిబ‌ద్ద‌త‌, రాజ‌కీయంగా ప‌రిణతి చెందిన వ్య‌క్తిత్వం న‌రేంద్ర మోదీ స‌క్సెస్ కు కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). గుజరాత్ ముఖ్యమంత్రి నుండి దేశాన్ని నడిపించే ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సంద‌ర్బంగా. ప్రజా సేవ పట్ల ఆయన నిబద్ధతను ప్రశంసించారు.

CM Chandrababu Key Comments

ప్ర‌ధానంగా న‌రేంద్ర మోదీ నాయకత్వం దార్శనికత, స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ మైలురాయిని గుర్తుచేసే ప్రధానమంత్రి పోస్ట్‌ను నాయుడు రీట్వీట్ చేశారు బుధ‌వారం త‌న ఎక్స్ ఖాతా వేదిక‌గా . ప్రజా సేవ పట్ల ఆయన నిబద్ధతను ప్రత్యేకంగా ప్ర‌స్తావించారు చంద్ర‌బాబు నాయుడు. ఈ గొప్ప దేశం పురోగతికి దోహద పడటం తన నిరంతర ప్రయత్నం అని నొక్కి చెప్పారు. అంతే కాదు దార్శనిక నాయకత్వం దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంద‌న్నారు. ప్రధానమంత్రి స్థిరమైన, దృఢ నిశ్చయంతో కూడిన నాయకత్వం భారతదేశ పాలనా నమూనాను పునర్నిర్మించింద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు నారా చంద్ర‌బాబు నాయుడు. పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చార‌ని, ఆయ‌న నాయ‌క‌త్వంలో దేశం అన్ని రంగాల‌లో ముందుకు సాగుతుంద‌న్నారు.

Also Read : Minister Ponnam Prabhakar Shocking Comments : పొన్నం ప్ర‌క‌ట‌న అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ఆవేద‌న

Exit mobile version