Chiranjeevi : టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో చిరంజీవి, నయనతార నటిస్తున్నారు. షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా కీలక అప్ డేట్ ఇచ్చాడు. ఆగస్టు 22 న మెగాస్టర్ చిరంజీవి (Chiranjeevi) పుట్టిన రోజు. ఈ నెలతో తనకు 70 ఏళ్లు పూర్తయ్యాయి. తను తీస్తున్న చిత్రంలో ఓ పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు అనిల్ రావిపూడి. ఇందులో మన శంకర వర ప్రసాద్ అని కూడా ఉంటుందన్నారు. అయితే చిరంజీవి లుక్ కోసం గ్రాఫిక్స్ ను ఉపయోగించ లేదని స్పష్టం చేశారు దర్శకుడు.
Chiranjeevi New Looks
అయితే అనిల్ రావిపూడి ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర గురించి ఆసక్తికరమైన వివరాలను వెల్లడించినప్పుడు మన శంకరవర ప్రసాద్ గ్లింప్స్ లాంచ్ చర్చ నీయాంశంగా మారింది. భారీ వీఎఫ్ఎక్స్ ,
డిజిటల్ టచ్-అప్‌లపై ఆధారపడే ధోరణికి భిన్నంగా, చిరంజీవి అద్భుతమైన కొత్త అవతార్ దాదాపు పూర్తిగా సహజ ప్రయత్నం ద్వారా రూపొందించడం జరిగిందని చెప్పారు దర్శకుడు. ఇది లుక్‌లలో ఒకటి మాత్రమేనని, సినిమాలో ఇంకా చాలా ఆశ్చర్యకరమైనవి చాలా ఉన్నాయన్నారు. ఈ సినిమా ఫుల్ గా అభిమానుల కోసం ఉంటుందని చెప్పకనే చెప్పాడు. తెరపై కనిపించే తీరుకు కారణం మెగాస్టార్ అనేనని పేర్కొన్నారు.
ప్రేక్షకులు చూసినది 90 నుండి 95 శాతం ఒరిజినల్ అని, ఎటువంటి ఆఫ్టర్-ఎఫెక్ట్స్ లేదా డిజిటల్ జోక్యాలు లేవని రావిపూడి నొక్కిచెప్పారు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవితో చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Mahavatar Narasimha Success : రూ. 300 కోట్ల వైపు మహావతార్ నరసింహా
