Chiranjeevi : హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమను పైరసీ ముఠా బారి నుంచి రక్షించారంటూ పేర్కొన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi). ఎక్స్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను, తెలంగాణ పోలీసులను అభినందించారు. ఐబొమ్మ, బొప్పం వెబ్ సైట్స్ ద్వారా వేలాది సినిమాలను అప్ లోడ్ చేయడం వల్ల వందల కోట్ల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఈ సైట్స్ నిర్వాహకుడు, ఓనర్ ఇమ్మడి రవి కుమార్ ను అదుపులోకి తీసుకోవడం, జైలులోకి పంపించడం ఆనందంగా ఉందన్నారు. ఎవరైనా సరే పైరసీకి పాల్పడవద్దని కోరారు. ఈ సందర్భంగా సోమవారం కీలక అంశాలు మీడియాకు వెళ్లడించారు సీపీ సజ్జనార్.
Chiranjeevi Appreciates CP Sajjanar
ఇమ్మడి రవికి క్రిమినల్ మెంటాలిటి కలిగి ఉన్నాడని తెలిపారు. తను వేరే పేరుతో మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు పాన్ కార్డు, ఇతర కార్డులు తీసుకున్నాడని చెప్పారు. ఇమ్మడి రవి హార్డ్‌డిస్క్‌లో 21 వేల సినిమాలు పెట్టాడని తెలిపారు. 1972లో విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా నుండి మొన్న విడుదలైన ఓజీ మూవీ దాకా ఉన్నాయని వెల్లడించారు సీపీ సజ్జనార్. ఈ పైరసీ మూవీస్ ద్వారా ఇమ్మడి రవి ఇప్పటి వరకు రూ.20 కోట్లు సంపాదించాడని స్పష్టం చేశారు. అందులో రూ.3 కోట్లు సీజ్ చేశామన్నారు. 50 లక్షల మంది డేటా ఇమ్మడి రవి దగ్గర ఉందన్నారు. ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : Akkineni Nagarjuna Shocking Comments on IBomma : ఉచితంగా సినిమా చూపించడం అనేది ఒక ట్రాప్

















