Chinta Mohan : విజయవాడ – పార్లమెంట్ లోకి సీఐఎస్ఎఫ్ ఫోర్స్ ఎంట్రీ ఇవ్వడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ (Chinta Mohan). గతంలో ఎన్నడూ ఇలా జరగ లేదన్నారు. పార్లమెంట్లో సభ్యులకు అవమానం జరిగిందన్నారు. బీహార్ విషయంపై ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులు మాట్లాడారని, దీనిపై అధికార బీజేపీ సర్కార్ అభ్యంతరం తెలిపిందన్నారు. కానీ స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి మార్షల్స్ ను ఎలా లోపలికి అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించారు చింతా మోహన్. 70 సంవత్సరాల పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ పోలీసులు వెళ్లిన దాఖలాలు లేవన్నారు.
Ex Union Minister Chinta Mohan Slams Slams Modi Govt
పార్లమెంట్ గొప్ప దేవాలయం అని, ప్రతిపక్ష సభ్యులను కంట్రోల్ చేయడానికి, మార్సల్స్ ను ఉపయోగించాలని స్పష్టం చేశారు. పోలీస్ ఫోర్సును అనుమతించి, బల ప్రయోగం చేయడం తప్పు అని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్ లో ఇంత పెద్ద గొప్ప రాజ్యాంగం, గొప్ప పార్లమెంటరీ విధానం లేదని స్పష్టం చేశారు. జర్నలిస్టులందరినీ పార్లమెంటు లోపలకి ఒకప్పుడు అనుమతించే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆరోపించారు. వాళ్లకు ఇష్టమైన వాళ్లకే అనుమతి ఇస్తున్నారంటూ మండిపడ్డారు చింతా మోహన్.
మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి పోయినప్పుడు, గౌతు లచ్చన్న, నెహ్రూ, ప్రకాశం పంతులకు తిరుపతిని రాజధాని చేయమని చెప్పారని అన్నారు. గౌతు లచ్చన్న చేసిన ప్రతిపాదనను, ఎన్జీ రంగా , తరిమెల నాగిరెడ్డి బలపరిచారని తెలిపారు. కానీ నీలం సంజీవరెడ్డి కర్నూలుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. అటు తర్వాత హైదరాబాదుకు, ఇప్పుడు రాజధాని అమరావతికి నా మిత్రుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారంటూ ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిపై పరిస్థితులు బాగా లేవన్నారు. కర్నూలు నుంచి ప్రకాశం జిల్లా వరకు ప్రజలెవరూ సంతోషంగా లేరన్నారు. రాయలసీమలో రాజధానిపై చిచ్చు మొదలైందన్నారు చింతా మోహన్.
Also Read : KCR Shocking Comments : రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయం – కేసీఆర్
