KCR : హైదరాబాద్ – పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో ఇక స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు.
ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచే బీఆర్ఎస్ శ్రేణులు ఆయా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో గెలుపొందేందుకు శాయ శక్తులా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా గట్టిగా కృషి చేయాలని స్పష్టం చేశారు.
KCR Key Comments
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దామని పేర్కొన్నారు కేసీఆర్ (KCR). బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఎండ గట్టాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభలో డజన్ మంది ఎంపీలు ఉంటే బనకచర్ల అంశంపై గట్టిగా కొట్లాడే వారన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బనకచర్లపై రాజకీయ, న్యాయ పరమైన పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధం కావాలని కోరారు కేసీఆర్. సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో పాటు బహిరంగ సభ నిర్వహించాలని స్పష్టం చేశారు మాజీ సీఎం. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పార్టీ కేడర్ ను నన్నద్దం చేయాలని దిశా నిర్దేశం చేశారు. 8న కరీంనగర్ సభ తర్వాత రాష్ట్రపతిని పార్టీ ప్రతినిధి బృందం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం విజ్ఞప్తి చేద్దామన్నారు.
Also Read : AP BJP Chief Madhav Alarming : దేశం గర్వించదగిన మానవుడు పింగళి వెంకయ్య
