AP BJP : అమరావతి – ఏపీలో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. కొత్తగా పార్టీ అధ్యక్షుడిగా కొలువు తీరిన తర్వాత మరింత ఫోకస్ పెట్టారు పీవీఎన్ మాధవ్. ఇందులో తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. గురువారం బిజెపి (AP BJP) రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధుల జాబితా ను ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ ప్రకటించారు. ఇప్పటికే బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జిలుగా కిలారు దిలీప్, చీఫ్ స్పోక్స్ పర్సన్ జయప్రకాష్ నారాయణ్ (జెపి) లను వెల్లడించారు. తాజాగా రాష్ట్ర అధికార ప్రతినిధి ల జాబితాలో మరికొందరిని చేర్చినట్లు తెలిపారు.
AP BJP Key Updates
వారిలో పలువురు కీలక నేతలకు చోటు కల్పించారు. నెల్లూరు జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత వాకాటి నారాయణ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పూడి తిరుపతి రావు, విజయవాడకు చెందిన సాదినేని యామిని శర్మ, కాకినాడకు చెందిన పెద్దిరెడ్డి రవి కిరణ్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముళ్లపూడి రేణకను అధికార ప్రతినిధులుగా నియమించారు. వీరితో పాటు కర్నూలుకు చెందిన డాక్టర్ వినుషా రెడ్డి, విశాఖపట్నంకు చెందిన డాక్టర్ కె. సుహాసిని ఆనంద్, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన డాక్టర్ నల్లా పవన్ కుమార్, తిరుపతికి చెందిన జల్లి మధుసూదన్, కర్నూల్ కు చెందిన కేబీఎన్బీ నరసింగరావు, గుంటూరుకు చెందిన దర్శనం శ్రీనివాస్, కడపకు చెందిన వంగల శశి భూషణ్ రెడ్డి, మచిలీపట్నంకు చెందిన చిరువోలు బుచ్చి రాజు కృష్ణ, విజయవాడకు చెందిన షేక్ బాజీని నియమించినట్లు తెలిపారు.
Also Read : KTR Alarming : ఓటరు జాబితా రూపకల్పనపై జాగ్రత్త
