Chinta Mohan Sensational Comments : బీజేపీ పాల‌న‌లో అన‌కొండ‌లా పెరిగిన అవినీతి

బీజేపీ, ఎన్డీయే పాల‌న‌లో ల‌క్ష కోట్ల స్కాం

Hello Telugu - Chinta Mohan Sensational Comments

Hello Telugu - Chinta Mohan Sensational Comments

Chinta Mohan : తిరుప‌తి – మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మోదీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. భారీ ఎత్తున అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆవేద‌న చెందారు. గురువారం చింతా మోహ‌న్ (Chinta Mohan) మీడియాతో మాట్లాడారు. బిజెపి, ఎన్డీయే ప్రభుత్వ పాలనలో లక్ష కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు. NPA అసెట్స్ అవినీతి బిజెపి, ప్రధాని సాధించిన గొప్ప విజయాల్లో అతి గొప్ప విజయం అంటూ ఎద్దేవా చేశారు చింతా మోహ‌న్.

Ex Union Minister Chinta Mohan Shocking Comments

బ్యాంకింగ్ మినిస్ట్రీ దాదాపు 14.50 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందన్నారు. ఇందులో అత్య‌ధిక శాతం గుజ‌రాతీల‌కే ల‌బ్ది చేకూరింద‌న్నారు.NPA మాఫీలో 10 శాతం డబ్బు తీసుకున్నారని, ఒక లక్ష కోట్లు అవినీతి దాటిందన్నారు. ఇందులో సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో తేల్చాల‌ని డిమాండ్ చేశారు చింతా మోహ‌న్. ఒక రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేయాలంటే బ్యాంకులు ఒప్పు కోవ‌ని,
ఒక నిరుద్యోగికి రుణం ఇవ్వాలంటే, రకరకాల నిబంధనలు చెపుతాయ‌ని పేర్కొన్నారు. కానీ 14.50 లక్షల కోట్ల రూపాయలు NPAలు మాఫీ చేసి, కోటీశ్వరులకు అండగా నిలిచింది బిజెపి ప్రభుత్వం అంటూ సీరియ‌స్ కామెంట్స్ చేశారు.

జగన్ బంగారు పాళ్యానికి వచ్చాడు వెళ్ళాడని, హెలిపాడ్ పర్మిషన్ ఇవ్వాలని నేను కూడా చెప్పానని అన్నారు చింతా మోహ‌న్. త‌ను మామిడి రైతులకు తలా లక్షలు ఇచ్చి పోతాడని అనుకున్నానని, కానీ రైతుల , బాధితుల చెవుల్లో పూలు పెట్టి వెళ్లి పోయాడ‌ని ఎద్దేవా చేశారు. రోడ్డు మీద ఉన్న వాళ్ల‌ను తీసుకొచ్చి షో చేశాడ‌న్నారు. ఫోటో గ్రాఫర్ పై దాడికి పాల్ప‌డ‌డం మంచిది కాద‌న్నారు.

Also Read : CM Siddaramaiah Interesting : నేనే సుప్రీం ఐదేళ్ల వరకు నేనే సీఎం

Exit mobile version