CM Siddaramaiah Interesting : నేనే సుప్రీం ఐదేళ్ల వరకు నేనే సీఎం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సిద్ద‌రామ‌య్య

Hello Telugu - CM Siddaramaiah Interesting

Hello Telugu - CM Siddaramaiah Interesting

CM Siddaramaiah : బెంగళూరు – క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. నిన్న‌టి దాకా మౌనంగా ఉంటూ వ‌చ్చిన సీఎం సిద్ద‌రామ‌య్య ఉన్న‌ట్టుండి దూకుడు పెంచారు. త‌న‌కు ఎదురే లేద‌ని, ఎవ‌రూ త‌న‌కు పోటీ కారంటూ పేర్కొన్నారు. గురువారం ఆయ‌న చిట్ చాట్ సంద‌ర్బంగా బాంబు పేల్చారు. ఇప్ప‌టికే పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది సీఎం సిద్ద‌రామ‌య్య‌ (CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ల మ‌ధ్య‌. అయినా హైక‌మాండ్ ఆదేశాల మేర‌కు, ప్ర‌త్యేకించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు స‌ర్ది చెప్ప‌డంతో డీకే శివ‌కుమార్ కాస్తా మౌనంగా ఉంటూ వ‌చ్చారు.

CM Siddaramaiah Shocking Comments

ఈ సమ‌యంలో పాల‌నా ప‌రంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం. ఇలాంటి త‌రుణంలో నేత‌ల మ‌ధ్య ఇబ్బంది కలిగించేలా ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ఎమ్మెల్యేలను సైతం, పార్టీ వ‌ర్గాల‌ను సైతం విస్తు పోయేలా చేసింది. తానే సుప్రీం అని, ఐదేళ్ల వ‌ర‌కు తానే క‌ర్ణాట‌క సీఎంగా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు సిద్ద‌రామ‌య్య‌. ఇందులో ఎలాంటి మార్పు అనేది ఉండ‌ద‌న్నారు. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌కు సీఎం అవ్వాలని ఆశ ఉంద‌ని, అందులో ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్నారు.

అయితే 2028 ఎన్నికల వరకు నేనే సీఎంగా ఉంటాన‌న్నారు. ఆయ‌న చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజ‌కీయాల‌లో క‌ల‌క‌లం రేపాయి. ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చ‌కు దారి తీసింది. ఇదిలా ఉండ‌గా సీఎం సిద్ద‌రామ‌య్య చేసిన కామెంట్స్ పై ఇంకా ఏఐసీసీ అధిష్టానం స్పందించ లేదు. ఎలాంటి కామెంట్స్ చేయ‌లేదు.

Also Read : Ka Paul Shocking Comments : బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ ల‌పై కేసుల మాటేంటి..?

Exit mobile version