Child Rights Commission Alarming : పిల్ల‌ల విష‌యంలో మీడియా జాగ్ర‌త్త‌లు పాటించాలి

తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్

Hello Telugu - Child Rights Commission Alarming

Hello Telugu - Child Rights Commission Alarming

Child Rights Commission : హైద‌రాబాద్ – పిల్లలకు సంబంధించిన వార్తలను కవర్ చేసేటప్పుడు జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ నిర్దేశించిన మార్గ‌ద‌ర్శ‌కాలను పాటించాల‌ని స్ప‌ష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ (Child Rights Commission) . పార్లమెంట్ చట్టం కింద ఏర్పడిన చట్ట బద్ధమైన సంస్థ త‌మ‌ద‌ని పేర్కొంది. (బాలల హక్కుల రక్షణ కమిషన్ చట్టం, 2005) , ప్రభుత్వాల యొక్క అన్ని చట్టాలు, విధానాలు, కార్యక్రమాలు, పరిపాలనా యంత్రాంగాలు, విధానాలు భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన బాలల హక్కుల దృక్పథానికి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించు కోవాల‌ని సూచించింది. కీలకమైన చట్టాల అమలును పర్యవేక్షించడం – JJ చట్టం, 2015, POCSO చట్టం, 2012 మరియు RTE చట్టం, 2009 – బాధ్యతకు సంబంధించిన చ‌ట్టాల గురించి అవ‌గాహ‌న ఉండాల‌ని పేర్కొంది.

Child Rights Commission Key Comments

వివిధ టీవీ ఛానెల్‌లు, మీడియా, వార్తా పత్రికలలో పిల్లలపై వార్తలను నివేదిస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చింద‌ని తెలిపింది. చాలా సందర్భాలలో పిల్లల గోప్యత, గౌరవ హక్కు ఉల్లంఘించ బడుతుందని కమిషన్ గమనించిందని పేర్కొంది. లైవ్ కవరేజ్ సమయంలో మైనర్ బాధితుడి ముఖాలు, గుర్తింపు బయట పడుతుండ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. చాలా వ్యక్తిగత, సన్నిహితమైన, అసౌకర్యవంతమైన ప్రశ్నలు వారిని అడ‌గ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొంది బాలల హ‌క్కుల క‌మిష‌న్. TRPల కోసం పిల్లల పట్ల చాలా కఠినంగా ప్రవర్తించడం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇది అనైతికమే కాకుండా భారతీయ చట్టం ప్రకారం మైనర్లకు హామీ ఇవ్వబడిన చట్టపరమైన రక్షణను కూడా ఉల్లంఘిస్తుందని భావించాల్సి ఉంఉంద‌ని పేర్కొంది.

ఈ విషయంలో, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్‌తో కలిసి మీడియా నిపుణుల కోసం హ్యాండ్‌బుక్ ద్వారా NCPCR జారీ చేసిన ముఖ్యమైన మార్గదర్శకాలను జతచేసి అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియజేయాలని అభ్యర్థించింది.

Also Read : Popular Actor Sonu Sood- Alphalite : ఆల్ఫాలీట్ వాడ‌కంతో మెరుగైన ఆరోగ్యం

Exit mobile version